కెన‌డా ర‌చ‌యిత్రి అన్నే కార్స‌న్‌కు సాహిత్యంలో నోబెల్

 2026 నోబెల్ సాహిత్య అవార్డును ప్ర‌క‌టించారు.  కెన‌డా ర‌చ‌యిత్రి అన్నే కార్స‌న్‌ను ఆ బ‌హుమ‌తి వ‌రించింది.  సాహిత్యంలో ఆమె కొత్త ప్ర‌క్రియ‌కు బీజం వేశారు.  స‌మాకాలీన సాహిత్యంలో కొత్త ఒర‌వ‌డి సృష్టించారు.  అన్నే కార్స‌న్ 1950లో టొరంటోలో జ‌న్మించారు.  1981లో ఓడీ ఎట్ ఆమో ఎర్గో స‌మ్ థీసిస్‌ను ఆమె డాక్ట‌రేట్ కోసం ప్ర‌జెంట్ చేశారు.  ఆమె ప్రాచీన గ్రీకు సాహిత్య అనువాదాలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందారు. ఈ అనువాదాలు ఆమె రచనలను బాగా ప్రభావితం చేశాయి.
ఆమె రచనలు ఒపెరా లిబ్రెట్టీల నుండి సాహిత్య విమర్శ, 1998 నాటి “ఆటోబయోగ్రఫీ ఆఫ్ రెడ్” వంటి పద్య నవలల వరకు విస్తరించి ఉన్నాయి. ఆమె శైలి 2019 నాటి “నార్మా జీన్ బేకర్ ఆఫ్ ట్రాయ్”లో స్పష్టంగా కనిపిస్తుంది.  ఇది యూరిపిడిస్ నాటకం “హెలెన్”లోని ట్రాయ్ హెలెన్, మార్లిన్ మన్రో కథలను మిళితం చేసిన ఒక ప్రదర్శన. పుస్తక ప్రియుల మధ్య తరచుగా భిన్నాభిప్రాయాలను రేకెత్తించే ఈ పురస్కార గ్రహీతలలో, కార్సన్ అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్, ఆలిస్ మున్రో, ఎర్నెస్ట్ హెమింగ్వే వంటి ప్రముఖుల సరసన స్థానం సంపాదించుకున్నారు.

1990లో ఆమె ఓ సిరీస్‌ను ప‌బ్లిష్ చేశారు. ద గ్లాసీ ఎస్ఏ,  గ్లాస్‌, ఐర‌నీ, గాడ్ అనే ర‌చ‌న‌లు చేశారు. దాంట్లో ఆమె సుదీర్ఘ క‌విత్వ ర‌చ‌న చేశారు.  1998లో ఆటోబ‌యోగ్ర‌ఫీ ఆఫ్ రెడ్‌.. ఏ నావెల్ ఇన్ వ‌ర్స్ అనే న‌వ‌ల రాశారామె. లైట్ ట‌చ్‌తో ఆమె క‌థ‌లు రాస్తూ.. ర‌చ‌నా శైలిలో కొత్త పోక‌డ‌లు వెతికారు. దీంతో ఆమె సాహిత్య ప్ర‌క్రియ‌పై ఆస‌క్తి పెరిగింది.  హాస్యం, వ్యంగాన్ని కూడా త‌న ర‌చ‌న‌ల్లో చూపారామె. 

ద బ్యూటీ ఆఫ్ ద హ‌జ్‌బెండ్‌.. ఏ ఫిక్ష‌న‌ల్ ఎస్సీ ఇన్ 29 టాంగోస్‌ను 2001లో ప‌బ్లిష్ చేశారు. త‌న భ‌ర్త గురించి ఆమె 29 ఎపిసోడ్‌లు రాశారు. జాక్ కీట్స్ సాహిత్య చ‌మ‌క్కుల‌ను వాడుతూ ఆమె ఆ క‌థ‌నాలు రాశారు. త‌న సోద‌రుడి జ్ఞాప‌కార్ధం నాక్స్ అనే ర‌చ‌న చేశారు. 1901 నుంచి 118 సార్లు సాహిత్య నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 122 మంది ర‌చ‌యిత‌లు సాహిత్య నోబెల్ అందుకున్నారు. 87 ఏళ్ల వ‌య‌సులో డోరిస్ లెస్సింగ్ అవార్డు స్వీక‌రించారు. నాలుగు సార్లు సాహిత్య నోబెల్‌ను ఇద్ద‌రిద్ద‌రు పంచుకున్నారు. స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్ అకాడ‌మీ సాహిత్య అవార్డును ప్ర‌క‌టిస్తుంది.

 

About The Author