హెచ్1బీ వీసాల నిబంధనలను ఉల్లంఘిస్తే సంస్థలకు భారీ జరిమానా విధించాలని రిపబ్లికన్ పార్టీకి చెందిన సభ్యులు అమెరికా ప్రతినిధుల సభలో ఓ బిల్లును ప్రవేశ పెట్టారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలకు గరిష్ఠంగా ప్రస్తుతం ఉన్న 35 వేల డాలర్ల నుంచి 2.5 లక్షల డాలర్ల (రూ. 2.42 కోట్లు)కు పెంచాలని ప్రతిపాదించారు. అలాగే ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా విధించే నిషేధ కాలాన్ని 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచనున్నారు.
ఇమ్మిగ్రేషన్ కు సంబంధించి నకిలీ పత్రాలను సృస్టించే వారి పైనా చర్యలు తీసుకోవాలని ఆ బిల్లులో పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ దస్త్రాల ఫోర్జరీ కేసుల్లో కూడా జరిమానాలను భారీగా పెంచాలని సెక్షన్ 274 సి సవరణ ద్వారా అమెరికా హెచ్1బి వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, అక్రమాలకు పాల్పడే వారిపై భారీ జరిమానాలు విధించేలా టెక్సాస్ ప్రతినిధి బెత్‌వాన్ డూయెన్ ‘ హెచ్1బీ వీసా ఫ్రాడ్ క్రాక్‌డౌన్ యాక్ట్’(హెచ్.ఆర్.10643) అనే కొత్త బిల్లును ప్రవేశ పెట్టారు.
ప్రస్తుతం ఈ బిల్లు హౌస్ జ్యుడీషియరీ కమిటీ పరిశీలనలో ఉంది. ఇది చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ,సెనేట్ ఆమోదం పొంది, ఆ తరువాత దేశాధ్యక్షుడి సంతకం కావాల్సి ఉంటుంది. అప్పటివరకు పాత హెచ్1 బి వీసా నిబంధనలే అమలులో ఉంటాయి. ఇటీవల అమెరికాలో హెచ్1బి వీసా ఫ్రాడ్ కేసుకు సంబంధించి తెలుగు సంతతికి చెందిన ఇద్దరికి అమెరికా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాలను విధించింది.
2016 నుండి 2026 మధ్యకాలంలో షార్ట్ టర్మ్ విజిటర్స్ (బి1/బి2)గా అమెరికా లోకి ప్రవేశించి, అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి ‘అసైలం’ (రాజకీయ ఆశ్రయం) దరఖాస్తులు చేసుకున్న సుమారు 2,00,000 మంది వీసాలను రద్దు చేయడానికి స్టేట్ డిపార్ట్‌మెంట్ సిద్ధమవుతోంది. పర్యాటక వీసాలను ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించడానికి లూప్‌హోల్‌గా వాడకూడదని అధికారులు హెచ్చరించారు.
మరోవంక, విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) కింద పని చేసేందుకుగాను, ప్రతి విద్యార్థి తరపున సంబంధిత విశ్వవిద్యాలయం 70 వేల డాలర్లు(రూ. 58 లక్షలకు పైగా) ఫీజుగా చెల్లించాలనే కొత్త నిబంధనను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆప్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ప్రతిపాదించింది. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ రెన్యువల్ లేదా పొడిగింపు కోసం అదనంగా మరో 30 వేల డాలర్లు వసూలు చేయాలని ప్రతిపాదనలో పేర్కొంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు తమ కోర్సుకు సంబంధించిన రంగంలో ఏడాది పాటు పనిచేసేందుకు ఓటీపీ వెసులుబాటు కల్పిస్తున్నది. అయితే ప్రస్తుత వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయని, విదేశాల నుంచి వచ్చే చవకైన శ్రామిక శక్తిని అడ్డుకొనేందుకే ఈ భారీ ఫీజులను ప్రతిపాదించినట్లు డీహెచ్‌ఎస్ తెలిపింది.

More Stories
హెన్రీ బీ కగన్, కెన్సో సోయిలకు కెమిస్ట్రీలో నోబెల్
2036 వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యంకు భారత్ తో సహా 7 దేశాలు పోటీ
ఫ్లైదుబాయ్ హీరో స్మిత్ మచ్చర్ పుర్రెకు పగుళ్లు.. అత్యవసరంగా ఆపరేషన్