‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’పై 6 నెలల్లో కఠిన చట్టాలు

‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’కు వ్యతిరేకంగా ఆరు నెలల్లో కఠిన చట్టాలు తీసుకొస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. ఉత్తరాఖండ్, గుజరాత్ తరహాలో రాష్ట్రంలో ఉమ్మడి పౌరసృ్మతి (యూసీసీ)ని అమలు చేస్తామని చెప్పారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ శతజయంతి సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. 
 
రాష్ట్రంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించమని చెబుతూ విభజన శక్తుల పట్ల ప్రజలు ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలి అని అధికారి పిలుపునిచ్చారు. ఉమ్మడి పౌరస్మృతిపై మాట్లాడుతూ ఉత్తరాఖండ్, గుజరాత్ తరహాలో పశ్చిమ బెంగాల్‌లోనూ యూసీసీని అమలు చేస్తామని సువేందు అధికారి తెలిపారు. “మాకు ఆరు నెలల సమయం ఇవ్వండి. ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’పై కూడా కఠిన చట్టాలు తీసుకొస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు. 
 
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చేసిన కీలకమైన ఎన్నికల హామీలలో ఉమ్మడి పౌర స్మృతి అమలు ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం యుసిసి ముసాయిదాను పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో, పశ్చిమ బెంగాల్‌లోని అన్ని వర్గాల ప్రజలకు వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాలపై పౌర చట్టాలను యుసిసి ఏకీకృతం చేస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం యుసిసి ముసాయిదాను పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. 

 
రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో, పశ్చిమ బెంగాల్‌లోని అన్ని వర్గాల ప్రజలకు వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాలపై పౌర చట్టాలను యుసిసి ఏకీకృతం చేస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ని లక్ష్యంగా చేసుకుని, ప్రజల మధ్య విభజన సృష్టిస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో బెంగాలీలు, బెంగాలీలు కాని వారి మధ్య మమత ప్రభుత్వం చీలికను సృష్టించిందని ఆయన ధ్వజమెత్తారు. 

About The Author