
ప్రజా సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తన కుటుంబ సభ్యులు, వారసుల సంక్షేమం కోసమే పాటుపడుతున్నారని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధ్వజమెత్తారు.
ఈ విషయం రాష్ట్ర ప్రజ లందరికీ తెలుసని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ఆ పార్టీని చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని ఎడప్పాడి జోష్యం చెప్పారు. సేలం జిల్లా ఎ. వాణియంబాడి, ముత్తునాయకన్‌పట్టి గ్రామాలలో అమ్మా ఉచిత క్లినిక్‌లను ఆయన ప్రారంభిస్తూ నిరుపేదల నవ్వుల్లో భగవంతుడు కనిపిస్తాడని దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై చెబుతుండేవారని గుర్తు చేశారు.
ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం ఆ దిశగానే నిరుపేదల బ్రతుకుల్లో ఆనందాన్ని కలిగించేలా అమ్మా ఉచిత క్లినిక్‌లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎంజీఆర్, జయలలితకు తామే వారసులమంటూ మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్ తదితర నాయకులు చెబుతుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఓట్ల కోస మే ఈ నాయకులు ఎంజీఆర్, జయలలిత పేర్లను వాడుకుం టున్నారని, వారిద్దరికీ అసలైన వారసులం తామేనని స్పష్టం చేశారు.
కరోనా సంక్షోభ సమయంలో తాను, మంత్రులు, వివిధ శాఖ అధికారులు నిర్బ యంగా రాష్ట్రమంతటా పర్యటి స్తూ ప్రజా సంక్షేమ పధకాలను ప్రారంభిస్తుంటే డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభలు, సమావేశాలు జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్యకువెళ్తేనే వారి సమస్య లను తెలుసుకోగలుగుతామని, ఇంటిపట్టునే గడుపుతున్న స్టాలిన్‌కు ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.
ఎనిమిది నెలలుగా ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది, కార్యకర్తలు చికిత్సలందిస్తున్నారని, ఈ కారణంగానే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగామని పేర్కొన్నారు. కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని, కరోనా మరణాల సంఖ్య కూడా తగ్గిపోయిందని చెప్పారు.
ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందంటూ పనిగట్టు కుని దుష్ప్రచారం సాగి స్తున్న స్టాలిన్‌ను ప్రజలు కూడా క్షమించరని దయ్యబట్టారు. డీఎంకే ప్రజల కోసం పనిచేసే పార్టీ కాదని, ఆ పార్టీ నేతల కుటుంబాల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని,
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు