అమూల్ ప్లాంట్‌తో పాడి రంగానికి కొత్త ఊతం

తెలంగాణలో ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చిన అమూల్ సంస్థకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో అమూల్ వంటి సంస్థల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ప్లాంట్ ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పాడి రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 
 
మెదక్ జిల్లా, తూప్రాన్‌లోని ఊర్జా పారిశ్రామిక పార్కులో దాదాపు రూ 400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న సబర్ డైరీ వారి మెగా ఇంటిగ్రేటెడ్ డైరీ ప్లాంట్ (అముల్ డైరీ). కు భూమి పూజ సందర్భంగా  మాట్లాడుతూ  రాబోయే 18 నెలల్లో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసుకుని, మహిళలు, యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని చెప్పారు.       పాలు, పాల ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 
 
అమూల్ సంస్థ పెట్టుబడులతో ఈ ప్రాంతంలో పాడి పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం పెంచే కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో డెయిరీ రంగ అభివృద్ధికి కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.  సహకార సంస్థలు అనగానే మహారాష్ట్ర, గుజరాత్ పేర్లే గుర్తుకు వస్తాయని చెబుతూ తెలంగాణలో కూడా సహకార వ్యవస్థను ఉద్యమంలా పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సహకార ఉద్యమం అనేది ఒక బిజినెస్ మోడల్ కాదని, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఒక ప్రజా ఉద్యమం అని చెప్పారు. 

సాబర్ డెయిరీ ద్వారా రోజుకు దాదాపు 50 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ జరగుతోంది. దాదాపు 50 వేల మంది పాల ఉత్పత్తిదారులు భాగస్వామ్యమై ఉన్నారు. వీరిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. 2025-26లో రూ.10,500 కోట్ల వార్షిక టర్నోవర్ నమోదు చేసుకుంది. సాబర్ డెయిరీ దారా పశువైద్యం అందించేందుకు వందలాది మంది వెటర్నరీ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. రైతుల ఇళ్ల దగ్గరకే వెళ్లి పశువులకు చికిత్స, డిసీజ్ కంట్రోల్ సర్వీసెస్ అందిస్తున్నారని వివరించారు.
అమూల్ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని, 50కి పైగా దేశాలకు అమూల్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని కిషన్ రెడ్డి కొనియాడారు. అమూల్ బ్రాండ్ ‘ఫుడ్ & డ్రింక్ 2026’ లో ప్రపంచంలోనే శక్తిమంతమైన డెయిరీ బ్రాండుగా గుర్తింపు పొందిందని చెప్పారు. తెలంగాణ ఆర్ధిక మంత్రి డి. శ్రీధర్ బాబు, మెదక్ యంపీ ఎం రఘునందన్ రావు కూడా పాల్గొన్నారు. 

About The Author