ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త హ‌త్య నిందితుడుకు ఎన్‌కౌంట‌ర్‌ లో గాయాలు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని దేవ‌రియాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న‌లో ఒక ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న దీప‌క్ తివారి గాయ‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న యూపీలోని లార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని సుతావ‌ర్ మోద్ ప్రాంతంలో జ‌రిగింది. ఎన్‌కౌంట‌ర్‌లో దీప‌క్ తివారి కాలికి గాయం కాగా, అత‌డి నుంచి ఒక దేశీ పిస్ట‌ల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

భిఖంప్ గ్రామానికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌ రామేష్ తివారికి, దీప‌క్ తివారి కుటుంబానికి మ‌ధ్య కొంత‌కాలంగా ఆస్తి విష‌యంలో విబేధాలు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో అక్టోబ‌ర్ 1న దీప‌క్ తివారి, మ‌రికొంద‌రు బంధువుల‌తో క‌లిసి రామేశ్వ‌ర్ తివారి ఇంటిపైకి వెళ్లి అత‌డిపై దాడి చేశారు. క‌ర్ర‌లు, రాడ్ల‌తో విరుచుకుప‌డ్డారు.  ఈ దాడిలో రామేశ్వ‌ర్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అత‌డిని వెంట‌నే కుటుంబ స‌భ్యులు స‌మీపంలోని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు.

అక్క‌డ్నుంచి మెరుగైన చికిత్స కోసం దేవ‌రియాలోని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ చికిత్స పొందుతూ అత‌డు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రామేశ్వ‌ర్ భార్య అమృతా దేవి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచార‌ణ ప్రారంభించిన పోలీసులు సంజ‌య్ తివారి, దీప‌క్ తివారి, ప్రంజ‌ల్ తివారి, అభినిత్ తివారి, ఆదిత్య తివారి, నిఖిల్ తివారిలపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఒక ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

నిందితుల కోసం గాలిస్తుండ‌గా దీప‌క్ తివారి పోలీసుల‌పై కాల్పులు జ‌రిపేందుకు ప్ర‌య‌త్నించాడు.  దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జ‌ర‌ప‌డంతో అత‌డి కాలికి గాయ‌మైంది. అనంత‌రం దీప‌క్ తివారిని పోలీసులు స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. ఈ ఘ‌ట‌న‌లో నిర్ల‌క్ష్యంగా ఉన్న న‌లుగురు పోలీసుల‌ను కూడా ఉన్న‌తాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ఇంకా విచార‌ణ కొన‌సాగుతోంది.

ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. గోరఖ్‌పూర్ రేంజ్ డీఐజీ ఎస్. చన్నప్ప, ఎస్‌హెచ్‌ఓ రాకేష్ సింగ్, సబ్-ఇన్‌స్పెక్టర్ రామ్ మురత్ రామ్, కానిస్టేబుళ్లు చంద్రభన్ భారతి, ప్రీతమ్ యాదవ్‌లను సస్పెండ్ చేశారు. 

ఈ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆ పోలీసు అధికారి తెలిపారు. రామేశ్వర్ తివారీ మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే ఈ తాజా ఎన్‌కౌంటర్ జరిగింది. నిందితులు పారిపోయే ప్రయత్నంలో కాల్పులు జరిపారన్న వాదనకు మించి, ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఇంకా మరిన్ని వివరాలు వెల్లడించలేదు.

 

About The Author