భారతదేశం తన రక్షణ రంగ సేకరణలో అత్యంత భారీ ప్రయత్నంలో భాగంగా, 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. సుమారు రూ. 3.25 లక్షల కోట్ల విలువైన ఈ ప్రతిపాదిత కొనుగోలుకు సంబంధించి ధరల చర్చలు, ఇతర కీలక అంశాలపై ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఒప్పందం ఖరారవుతుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్ తెలిపారు.
అక్టోబర్ 8న జరగనున్న 94వ వైమానిక దళ దినోత్సవానికి ముందు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశం తన రక్షణ రంగ సేకరణలో అత్యంత భారీ ప్రయత్నంలో భాగంగా, 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. సుమారు రూ. 3.25 లక్షల కోట్ల విలువైన ఈ ప్రతిపాదిత కొనుగోలుకు సంబంధించి ధరల చర్చలు, ఇతర కీలక అంశాలపై ప్రక్రియ కొనసాగుతుంది.
ఫ్రాన్స్ తో ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత, భారత వైమానిక దళం ఇప్పటికే ఉపయోగిస్తున్న 36 రఫేల్‌లతో పాటు, తమ విమాన వాహక నౌకలపై మోహరించడం కోసం భారత నౌకాదళం ఆర్డర్ చేసిన 26 రఫేల్-ఎం యుద్ధ విమానాలతో కలిపి, భారతదేశపు మొత్తం రఫేల్ విమానాల సంఖ్య 176కు పెరుగుతుంది.
దీంతో పాటు, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసిఎ) కార్యక్రమంలో జాప్యం జరిగితే, మరో విమానాన్ని కొనుగోలు చేసే విషయాన్ని దళం పరిశీలించే అవకాశం ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ సూచించారు. “రష్యా మనకు సు-57 జెట్లను ప్రతిపాదించింది. కానీ దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు,” అని ఆయన పేర్కొన్నారు.
తగ్గుతున్న యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల బలంపై మాట్లాడుతూ, రాబోయే కొన్నేళ్లలో ఐఏఎఫ్‌కు ఏటా కనీసం 36 నుంచి 40 విమానాలు అవసరమని ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ తెలిపారు. భారతదేశం తన వాయు శక్తిని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది, ఇది మొత్తం సైనిక బలం విషయంలో చాలా కీలకమైనది.
దళాల ఆధునీకరణపై సింగ్ మాట్లాడుతూ, “మనకు ఏఐ-ఆధారిత దళం ఉండాలి” అని చెబుతూ మొత్తం పోరాట సంసిద్ధతకు ఆత్మనిర్భరత చాలా కీలకమని ఆయన జోడించారు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) తన వద్ద ఉన్న ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్య 30 కంటే తక్కువకు పడిపోకుండా చూసుకోవడానికి, మంజూరైన 42 స్క్వాడ్రన్ల స్థాయికి చేరుకోవడానికి ఏటా 36 నుండి 40 విమానాలను తన అమ్ములపొదిలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఏటా 24 ఎల్‌సిఏ ఎంకే1ఏ విమానాలను అందించాలనే లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, హెచ్ఏఏ ఏడాదికి 20 విమానాలను తయారు చేసినా, ఈ ఏడాది చివరి నాటికి ‘మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్’ (ఎంఆర్ఎఫ్ఏ) ఒప్పందం ఖరారైనా, మొత్తం వార్షిక చేరిక సుమారు 32 విమానాలకు చేరుకుంటుందని ఆయన చెప్పారు.
ఎంఆర్ఎఫ్ఏ కార్యక్రమం కింద ఐఏఎఫ్ ఏటా సుమారు 12 విమానాలను పొందుతుంది. ఇందులో భాగంగా 114 రాఫెల్ జెట్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. అదనంగా 12 ఎస్యు-30 విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదిత ఒప్పందాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ఏటా ఆరు జెట్లను స్వీకరిస్తే, ప్రణాళికలన్నీ ఆశించిన విధంగా సాగితే వార్షిక చేరిక సంఖ్య 30 నుండి 35-40 విమానాల వరకు పెరగవచ్చని ఆయన తెలిపారు.
వివిధ రకాల విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా, వైమానిక దళం వద్ద మూడు లేదా నాలుగు రకాల ఫైటర్ జెట్ల మిశ్రమం ఉండటం సమంజసమని చెప్పారు. చైనాకు చెందిన ఐదవ తరం జె-35 ‘స్టెల్త్’ ఫైటర్ జెట్‌ను పాకిస్థాన్ కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తోందన్న వార్తల గురించి ప్రస్తావిస్తూ, ఇది ఆందోళన కలిగించే విషయమని ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ పేర్కొన్నారు.

More Stories
యుపిలో 23,000 మంది నేరస్తుల అరెస్టు, రూ. 15,233 కోట్ల ఆస్తుల జప్తు
రెండు పార్లమెంటరీ కమిటీల ఛైర్మన్ పదవులను కోల్పోయిన మమత
హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి సమన్వయంతో ప్రణాళికలు