రెండు పార్లమెంటరీ కమిటీల ఛైర్మన్ పదవులను కోల్పోయిన మమత 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. పార్టీలో చీలిక, అగ్రనేతలపై దాడులు, అలాగే కీలక నేతల రాజీనామాలతో సతమతమవుతున్న తృణమూల్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది.   పార్లమెంటరీ కమిటీల ఛైర్‌పర్సన్‌ల పునర్‌వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో, 24 కమిటీలలో ఆరింటిలో మార్పులు చోటుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీల బృందం పార్టీ మారడంతో, ఆ ఆ పార్టీ రెండు ఛైర్‌పర్సన్ పదవులను కోల్పోయింది. 

రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం నాడు వివిధ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను పునర్వ్యవస్థీకరించడంతో ఈ ఎదురుదెబ్బ మమతా పార్టీకి తగిలింది. వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా టీఎంసీకి చెందిన డోలా సేన్ స్థానంలో బీజేపీ నేత సుధాన్షు త్రివేది నియమితులయ్యారు. 

అలాగే రసాయనాలు, ఎరువుల కమిటీ ఛైర్మన్‌గా టీఎంసీలోని అసమ్మతి వర్గానికి చెందిన కకోలి ఘోష్ దస్తీదార్ ఎంపికయ్యారు. టీఎంసీ నేత కీర్తి ఆజాద్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. పరిశ్రమల కమిటీకి తిరుచి శివ (డీఎంకే), ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ కమిటీకి కె. కనిమొళి (డీఎంకే) మరోసారి ఛైర్మన్లుగా నియమితులయ్యారు. 

బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, శివసేన, టిడిపిలకు చెందిన నాయకులు కూడా వివిధ పార్లమెంటరీ కమిటీల అధిపతులుగా కొనసాగుతున్నారు. బీజేపీ తన మూడు కమిటీల అధ్యక్షులను మార్చింది. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్ కమిటీకి అధ్యక్షత వహించేందుకు పార్టీ ఎంపీ బ్రిజ్ లాల్ స్థానంలో తన పార్టీ సహచరుడు సుజీత్ కుమార్‌ను నియమించింది.

లేబర్, టెక్స్‌టైల్స్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ కమిటీకి అధ్యక్షత వహించేందుకు లోక్‌సభ ఎంపీ బసవరాజ్ బొమ్మై స్థానంలో శశాంక్ మణిని బీజేపీ నియమించింది. బీజేపీ చేసిన మూడవ మార్పు రైల్వే కమిటీలో. ఈ కమిటీలో సీఎం రమేష్ స్థానంలో బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తాను నియమించింది.

ఆపరేషన్ సింధూర్‌తో సహా కీలక విధానపరమైన అంశాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరితో తరచుగా విభేదిస్తున్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, కీలకమైన విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి అధిపతిగా కొనసాగుతున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ వ్యవసాయ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ముకుల్ వాస్నిక్ మహిళలు, పిల్లలు మరియు విద్యపై కమిటీకి అధిపతిగా కొనసాగుతారు. 

 
రక్షణ కమిటీకి బీజేపీకి చెందిన రాధా మోహన్ సింగ్; హోం కమిటీకి బీజేపీకి చెందిన రాధా మోహన్ దాస్ అగర్వాల్; ఐటీ, కమ్యూనికేషన్స్ కమిటీకి బీజేపీకి చెందిన నిషికాంత్ దుబే; బొగ్గు, గనుల కమిటీకి బీజేపీకి చెందిన అనురాగ్ ఠాకూర్; జలవనరుల కమిటీకి బీజేపీకి చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీ అధిపతిగా కొనసాగుతారు. ఆర్థిక కమిటీకి ప్రస్తుత సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ అధిపతిగా ఉంటారు. 
 
పదవీ విరమణ చేసిన బ్రిజ్ లాల్ స్థానంలో బీజేపీకి చెందిన సుజీత్ కుమార్ సిబ్బంది కమిటీకి అధ్యక్షత వహిస్తారు. సభ్యులలో, ఆప్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, స్వాతి మాలివాల్‌ను విద్యాశాఖ సభ్యురాలిగా నియమించారు.

About The Author