టర్కీలో ఉంటున్న డ్రగ్స్ అక్రమ వ్యాపారి నవ్‌ప్రీత్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం టర్కీ ప్రభుత్వాన్ని భారత్ కు తీసుకు వచ్చిన్నట్లు కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. మోదీ అధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అక్రమ డ్రగ్స్ వినియోగాన్ని ఎంతమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. 2029లోపు దేశంలో డ్రగ్స్ ముఠాలను అంతం చేయాలనేది మోదీ ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా తెలిపారు.
ఇప్పటికే నవ్‌ప్రీత్ సింగ్‌ను ఇండియా తీసుకొచ్చామని, ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని అమిత్ షా తెలిపారు. నవ్‌ప్రీత్ అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్. ఆఫ్గనిస్తాన్ నుంచి హెరాయిస్ సహా విలువై, అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ను అతడు ఇండియా, టర్కీలకు సరఫరా చేస్తుంటాడు. ఇందుకోసం పెద్ద నెట్వర్క్ నిర్వహిస్తున్నాడు. అక్రమ డ్రగ్స్ వ్యాపారంలో ఎప్పటినుంచో కీలకంగా వ్యవహరిస్తున్నాడు.
ఇండియాకు కూడా భారీ స్థాయిలో నిషేధిత మత్తు పదార్థాల్ని రవాణా చేస్తుంటాడు. ఇండియన్ అయిన అతడు ఇక్కడి నుంచి టర్కీ పారిపోయాడు. అక్కడ నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించుకున్న నవ్‌ప్రీత్ సింగ్.. టర్కీలో నవాబ్ విర్క్గా చెలామణి అవుతున్నాడు. దొంగ పత్రాలతో టర్కీ పౌరసత్వం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి స్థావరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అతడిని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది.
ఈ అంశంపై టర్కీ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. దీనికి టర్కీ అంగీకరించింది. దీంతో అతడిని కేంద్రం ఇండియా తీసుకొచ్చింది. నవ్‌ప్రీత్ సింగ్ చేసిన నేరాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. నవ్‌ప్రీత్ సింగ్ ఇండియాకు అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తుండగా.. ఇండియాలో అతడి దగ్గరి బంధువు ప్రభ్‌దీప్ సింగ్ ఈ డ్రగ్స్ రవాణా, వ్యాపారంలో పాలుపంచుకుంటాడు.
ప్రభ్‌దీప్ సింగ్‌ను గత మే లోనే దర్యాప్తు సంస్థలు ఇండియా తీసుకొచ్చాయి. అతడిపై రెడ్ నోటీస్ ఉండటంతో అజార్బైజాన్లో పట్టుబడ్డాడు. దీంతో ఢిల్లీ పోలీసులు, సీబీఐ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కలిసి అతడిని ఇండియా తీసుకొచ్చాయి.
పరారైన నేరస్థులను దేశానికి రప్పించేందుకు మోదీ ప్రభుత్వం సమన్వయ ప్రచారాన్ని ప్రారంభించింది. 2019 నుంచి 2026 ఆగస్టు నాటికి మొత్తం 36 దేశాల నుంచి 288 మంది పరారైన నేరస్థులను భారత్‌కు రప్పించింది. పరారైన నేరస్థులపై త్రిముఖ వ్యూహాలైన ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు, బలమైన సమన్వయం, క్రియాశీల దౌత్యనీతి గురించి వివరిస్తూ దేశ సార్వభౌమాధికారం, ఆర్థిక స్థిరత్వం, శాంతిభద్రతలు, జాతీయ భద్రతతో పరారైన నేరస్థుల సమస్య ముడిపడి ఉంటుందని అమిత్ షా తెలిపారు.

More Stories
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఉత్కంఠ
సెప్టెంబర్‌లోనూ 24 బిలియన్లు దాటిన యూపీఐ చెల్లింపులు
113 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ లో నటి రన్యా రావుకు రూ. 58 కోట్ల జరిమానా