బేరియం ఆధారిత బాణసంచా వినియోగంపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నుంచి నివేదిక సమర్పించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోరారు. బేరియం ఆధారిత బాణసంచాపై బహిరంగ పరీక్షలు ఇంకా నిర్వహించలేదని ఆమె కోర్టుకు తెలిపారు. దీనిపై సీపీసీబీ తన నివేదికను సమర్పించేందుకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది.
ఒకే ఫ్యూజ్తో వరుసగా పేలే జాయింట్ బాణసంచా వినియోగాన్ని కొన్ని నిబంధనలకు లోబడి అనుమతించే అంశాన్ని కూడా కోర్టు పరిశీలిస్తోంది. విచారణ సందర్భంగా సమర్పించిన సూచనలను పరిగణనలోకి తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ధర్మాసనం పేర్కొంది.
దీపావళి సమయంలో వాయు కాలుష్యంపై దృష్టి పెట్టిన సుప్రీంకోర్టు పంటల దహనం వంటి ఇతర కారణాలు కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయని ప్రస్తావించింది. అయితే బాణసంచా అనియంత్రిత వినియోగాన్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. పండుగ సమయంలో నిర్దిష్ట సమయాల్లో మాత్రమే వినియోగించే విధానంపై పరిశీలన కొనసాగుతుందని తెలిపింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ సహా వాయు కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో అక్టోబర్ నుంచి జనవరి మధ్య బాణసంచాపై ఆంక్షలకు సంబంధించిన 2015 నాటి కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. గతంలో కూడా పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాణసంచా వినియోగంపై పలు ఆదేశాలు జారీ చేసింది.

More Stories
పాక్ గగనతలం మూసేయడంతో చైనా మార్గం కోసం భారత్ చర్చలు!
ఎల్ఈటి అగ్రశ్రేణి కమాండర్ ఫౌజీ మూసా కాల్చివేత
అసోం రైఫిల్స్ దళాలపై ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి