సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషితో కూడిన పూర్తిస్థాయి కమిషన్ ఈనెల 26న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం ప్రకారం, సర్ ప్రక్రియ పూర్తయిన ప్రాంతాల్లో కొత్త ఓటర్లు ఇకపై ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్దేశించిన సాధారణ ఫారం-6ను మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది.
సర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం అదనపు డిక్లరేషన్ అందుబాటులో ఉంది. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే దరఖాస్తుదారులు తాము లేదా తమ తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు గతంలో జరిగిన ప్రత్యేక సమగ్ర సవరణ సమయంలో రూపొందించిన ఓటర్ల జాబితాల్లో ఉన్నారనే వివరాలను అందించాల్సి ఉంటుంద
ఈ అదనపు ప్రకటనను సర్ ప్రక్రియలో భాగంగానే ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అయితే సవరణ పూర్తయిన ప్రాంతాల్లో దాని అవసరం ఉండదని స్పష్టం చేస్తూ తాజాగా ఆప్షన్‌ను తొలగించింది. సర్ పూర్తయిన ప్రాంతాల్లో అదనపు డిక్లరేషన్‌ను ఈసీఐనెట్ యాప్, పోర్టల్ నుంచి తొలగించారు. సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) వెబ్‌సైట్లలోనూ ఇదే మార్పు చేశారు. సర్ అమలు లేని సమయంలో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960 ప్రకారం వర్తించే సాధారణ ఫారమ్‌లనే ఉపయోగిస్తామని స్పష్టం చేసింది.
ఫారం-6కు సంబంధించిన మార్పులపై కమిషనర్లు సంధు, జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు రావటం ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఫారం-6లో చేసిన మార్పుల అంశం గతంలో ఎన్నికల సంఘంలోనే చర్చనీయాంశమైంది. నిబంధనల ద్వారా నిర్దేశించిన ఫారమ్‌ను సంబంధిత నిబంధనలను సవరించకుండా మార్చలేదని, అలాగే ఈసీఐనెట్‌లో ఫారం-6 దరఖాస్తు ప్రక్రియకు సర్‌కు సంబంధించిన అదనపు డిక్లరేషన్‌ను జత చేయడంపైనా సంధు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే ఎన్నిక సంఘం మాత్రం ఫారం-6ను సవరించలేదని స్పష్టం చేస్తూ వచ్చింది. తాము జత చేసినది సర్‌కు మాత్రమే వర్తించే అదనపు ప్రకటన అని వివరణ ఇచ్చింది. బిహార్‌లో చేపట్టిన సర్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనూ ఈ డిక్లరేషన్‌కు సంబంధించిన అంశాన్ని కోర్టు సమర్థించిందని ఈసీ పేర్కొంది.

More Stories
ఇండియా కూటమి భేటీకి దూరంగా ఆప్, డీఎంకే, ఊగిసలాటలో అఖిలేష్
రాహుల్ `వోట్ చోరీ’ ఆందోళనలపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయం!
తోటి జవాన్ కాల్పుల్లో నలుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బంది మృతి