పండుగ సీజన్‌కు ముందే వచ్చే నెల 1 నుంచి ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌ల ధరలు 5నుండి 8శాతం వరకు పెరగనున్నాయి. ఈ ఏడాదిలో కంపెనీలు ధరలు పెంచడం ఇది మూడోసారి కాగా, ఇప్పటివరకు మొత్తం 23 శాతం వరకు ధరలు పెరిగాయి. రాగి, ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్, క్రూడాయిల్ ధరలు పెరగడం, పశ్చిమాసియా యుద్ధం వల్ల ఫ్రైట్ ఛార్జీలు, కరెన్సీ హెచ్చుతగ్గులు వంటివి పరిణామాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా కారణమయ్యాయి.
గత ఏడాది టన్ను 8,000-9,000 డాలర్లు ఉన్న రాగి ధర ఇప్పుడు 14,500 డాలర్లకు చేరింది. ఒక్క ఏసీ తయారీకే 3-4 కిలోల రాగి అవసరం కావడంతో వీటిపైనే భారం ఎక్కువగా పడింది. బ్లూ స్టార్, గోద్రెజ్ అప్లయన్సెస్, హైయర్, డైకి న్, ఎల్‌జీ, హితాచీ, సూపర్ ప్లాస్ట్రానిక్స్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే 4 నుంచి 10 శాతం పె టంపును ప్రకటించాయి. ఏసీలపై 5-8%, టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్‌లపై 3-4% పెరుగుతాయని అంచనా ఉంది.
బ్లూ స్టార్ ఎండి బి త్యాగరాజన్ మాట్లాడుతూ, యుద్ధం వల్ల అన్ని కమోడిటీ ధరలు పెరిగాయని, గత పండగ సీజ న్‌తో పోలిస్తే తయారీ ఖర్చులు 15% పెరిగాయని, కానీ జిఎస్‌టి తగ్గింపు వల్ల 10% ప్రయోజనం లభించడటంతో వినియోగదారుడిపై నిక ర భారం 5% మాత్రమే ఉంటుందని అన్నారు. గోద్రెజ్ అప్లయన్సెస్ హెడ్ కమల్ నంది మాట్లాడుతూ, 8-10% ఉత్పత్తి వ్యయం పెరగడంతో 5-7% ధర పెంపు అనివార్యమైందని తెలిపారు.
కొన్ని కంపెనీలు అక్టోబర్ నుంచి, మరిన్ని నవంబర్ నుంచి పెంచుతాయని తెలిపారు. అయితే దీపావళి వరకు పాత ధరలతో కొనుగోలు చేసే అవకాశముందని కంపెనీలు చెబుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో ముందే స్టాక్ తెచ్చుకోవడం వల్ల పాత సరకు నెలన్నర వరకు ఉంటుందని, దీపావళి తర్వాత కొత్త ధరలు పూర్తిగా అమల్లోకి వస్తాయని తెలిపారు.
హైయ ర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్‌ఎస్ సతీష్ మాట్లాడుతూ, ధరలు పెంచకపోతే నష్టపోతామని, తప్పదని పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి ఏసీలపై 5%, ఇతర వస్తువులపై 2-3% పెంచి, డిసెంబర్, జనవరిలో మరో 5% చొప్పున మొత్తం 15% వరకు పెంచే ఆలోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు. గత ఏడాది జిఎస్‌టి తగ్గింపుతో ధరలు తగ్గగా, ఇప్పుడు మళ్లీ పెరగడం పండగ సీజన్‌లో కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలను నిరాశపర్చినట్లైంది.

More Stories
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధింపుపై స్టేకు సుప్రీం నిరాకరణ
సెన్సెక్స్ పతనంతో గంటల వ్యవధిలో రూ 6 లక్షల కోట్లు ఆవిరి
మూడు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా