ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో ఎనిమిదో రోజు భారత బృందం అదరగొడుతోంది. స్క్వాష్‌లో అనాహత్ సింగ్ సిల్వర్ మెడల్ సాధించిన కాసేపటికే మహిళల 200 మీటర్ల ఫైనల్లో హరిత భత్రా పతక పోరులో శక్తినంతా కూడదీసుకొని పరుగెత్తిన తను.. మూడో స్థానంలో నిలిచింది. జపాన్ అథ్లెట్‌ను వెనక్కి నెట్టి 23.20 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న హరిత పోడియం మీద సగర్వంగా కాంస్యంను అందుకుంది.
తద్వారా మహరాష్ట్రకు చెందిన హరిత యావత్ భారతావనని పులకింపజేసింది. ఆద్యంతం హోరాహోరీ సాగిన పరుగులో జపాన్‌కు చెందిన అబిగెరుఫుక ఇడోను 0.01 సెకన్లతో వెనక్కి నెట్టింది. చిరుతలా పరుగు తీసిన 23 ఏళ్ల హరిత 23.20 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది.
ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్ క్రీడాకారిణి అనాహత్ సింగ్ చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత మహిళగా ఆమె రికార్డు నెలకొల్పింది. ఫైనల్‌లో మలేషియాకు చెందిన శివశంగరి సుబ్రహ్మణ్యం చేతిలో ఓటమి ఎదురైనా అనాహత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మ్యాచ్‌లో ఆరంభం నుంచే మలేషియా క్రీడాకారిణి ఆధిపత్యం ప్రదర్శించింది.
దీంతో అనాహత్ సింగ్ 4-11, 4-11, 7-11 తేడాతో ఓటమి పాలైంది. ఫైనల్లో ఓడినప్పటికీ ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో రజత పతకం సాధించడం ద్వారా అనాహత్ సింగ్ భారత స్క్వాష్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. కీలక దశల్లో ఒత్తిడిని అధిగమిస్తూ ఫైనల్ వరకు చేరుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన మూడవ భారతీయ స్క్వాష్ సింగిల్స్ క్రీడాకారిణిగా అనహత్ సింగ్ నిలిచారు. ఈ క్రీడ 2028లో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేస్తోంది.
ఈ విజయంతో భారత స్క్వాష్‌కు ఆసియా క్రీడల్లో మరో పతకం దక్కింది. అనాహత్ సింగ్ ప్రదర్శనపై అభిమానులు, క్రీడా వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విభాగంలో పురుషుల సింగిల్స్‌లోనూ భారత్ రజత పతకం సాధించింది. భారత క్రీడాకారుడు అభయ్ సింగ్ పురుషుల సింగిల్స్‌లో రజతం గెలుచుకున్నాడు. దీంతో ఆసియా క్రీడల స్క్వాష్ పోటీల్లో భారత్‌కు మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో రజత పతకాలు లభించాయి.
కాగా, బాక్సింగ్ లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. భారత బాక్సర్ అంకుష్ పంగల్ 80 కిలోల విభాగంలో ఆదివారం ఉదయం జరిగిన పురుషుల క్వార్టర్‌ఫైనల్‌లో తజికిస్థాన్ కు చెందిన నెక్రుజ్ సలీమోవ్ ను 5-0 తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. గత నెల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అంకుష్ స్వర్ణం సాధించాడు.

More Stories
ఉగ్రవాదాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్న పాక్
ఏఐకు 100 కోట్ల మంది మరణాలకు దారితీసే శక్తీ
పాకిస్తాన్లో మానవబాంబు పేలుడు.. 12 మంది మృతి