ఫస్ట్ హాఫ్ టైంలో ఇండియా 22-16 స్కోరుతో ఆధిక్యాన్ని చాటింది. కానీ సెకండ్ హాఫ్‌లో ఇరాన్ అత్యుత్తమ ఆటను ప్రదర్శించింది. సెకండ్ హాఫ్‌లో 18-15 స్కోరుతో ఇరాన్ ఆధిక్యాన్ని ప్రదర్శించినా ఫస్ట్ హాఫ్ లీడ్ వల్ల భారత్‌కు విజయం ఈజీ అయ్యింది. ఇప్పటి వరకు ఏషియన్ గేమ్స్‌లో ఇండియాకు మహిళల కబడ్డీలో స్వర్ణ పతకం దక్కింది. కేవలం 2018లో మాత్రం భారత జట్టు సిల్వర్ మెడల్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. పురుషుల కబడ్డీలో భారత్ మరో స్వర్ణం గెలిచింది.
ఫైనల్‌లో ఇరాన్‌పై 40-34 తేడాతో భారత్ జట్టు విజయం సాధించింది. కబడ్డీలో రికార్డు స్థాయిలో 9వసారి భారత్ స్వర్ణం గెలిచింది. మారథాన్‌లో భారత అథ్లెట్ సావన్ బర్వాల్ రజత పతకం దక్కించుకున్నారు. 42.195 కిలోమీటర్ల మారథాన్‌ను 2 గంటల 11 నిమిషాల 37 సెకండ్ల వ్యవధిలో ముగించి సావన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ విజయంతో 42 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మారథాన్‌లో భారత్‌కు పతకం లభించింది.
ఆసియా క్రీడలు 2026లో పతకాలు సాధించిన భారత కబడ్డీ జట్లు, స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ జోడీ జోష్నా చినప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్, అలాగే షూటర్లు తిలోత్తమ సేన్, విదర్స వినోద్ కొచలుంకల్, ఆషి చౌక్సీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించిన భారత షూటింగ్ త్రయాన్ని ప్రశంసిస్తూ, వారి విజయానికి కారణమైన సమిష్టి కృషిని రాష్ట్రపతి ముర్ము ప్రత్యేకంగా ప్రస్తావించారు.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కమల్‌జీత్- సురుచి ఇందర్ సింగ్ గేమ్స్ రికార్డు బ్రేక్ చేస్తూ స్వర్ణ పతకాన్ని ముద్దాడారు. వ్యక్తిగత విభాగాల్లో ఎదురైన నిరాశను చెరిపేస్తూ మెగా క్రీడల్లో దేశానికి రెండో పసిడి పతకాన్ని అందించారు. కాగా, ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 27 పతకాలు సాధించగా, అందులో 4 స్వర్ణాలు, 11 రజతాలు, 12 కాంస్య పతకాలు కావడం విశేషం

More Stories
ఉగ్రవాదంపై పరిణామాలు తధ్యం.. పాక్ కు భారత్ హెచ్చరిక
ఒక ఉగ్రవాద దేశం నన్ను ఆ ప్రశ్న అడుగుతుంది.. జైశంకర్ ఎద్దేవా
“తైవాన్ స్వాతంత్ర్యాన్ని” వ్యతిరేకించాలని ట్రంప్ ను కోరిన జిన్‌పింగ్