దీనదయాళ్ కు దత్తాత్రేయ ఘనంగా నివాళులు


మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లోని రాంనగర్‌లో “అంత్యోదయ దివస్” సందర్భంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ   110వ జయంతిని పురస్కరించుకుని వారికి ఘన నివాళులర్పించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆనాటి “భారతీయ జన్ సంఘ్”, నేటి “భారతీయ జనతా పార్టీ” కి సైద్ధాంతిక భూమికను, వ్యవస్థను నిర్మాణం చేసిన గొప్ప మహానుభావుడని, నిస్వార్ధ ప్రజాసేవకుడని, గొప్ప దేశ భక్తుడని సందర్భంగా కొనియాడారు.

“సరళమైన జీవనం, ఉన్నతమైన ఆలోచన” అనే వారి ప్రబోధాలు, “పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదానికి”  ప్రత్యామ్నాయం దేశానికి ఏకాత్మ మానవతావాదమే నిజమైన అభివృద్ధికి సోపానమని ప్రవచించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ  మహానుభావుడని తెలిపారు. ఆయనకు నిజమైన నివాళులు అర్పించడమంటే రాజకీయాల్లో నైతిక విలువలు పాటించడం, నీతి నిజాయితీగా వ్యవహరించడమే అని  దత్తాత్రేయ స్పష్టం చేశారు.  బిజెపి రాష్ట్ర వికలాంగుల సెల్ కన్వీనర్  కొల్లి నాగేశ్వరరావు, బీజేపీ అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షుడు పాశం సాయి కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

 

About The Author