విజయవాడకు చెంది గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ కేసు వివరాలను సీల్డ్ కవర్‌లో సెప్టెంబర్ 30లోగా సుప్రీంకోర్టుకు అందజేయాలని ఆదేశించింది. ప్రతివాదులందరకీ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.
సాయికృష్ణ కేసులో రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టులో విచారణపైస్టే విధించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీలు ఎలా పనిచేయకుండా ఉంటాయి? ఎందుకు మాయం అయ్యాయి? అంటూ ప్రశ్నించింది.
సాయికృష్ణ తల్లి మే 28నే డీజీపీకి ఫిర్యాదు చేసినా జూన్ 19 వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని గుర్తు చేసింది. సాయికృష్ణ అదృశ్యం గురించి సమాచారం వచ్చిన వెంటనే చర్యలు తీసుకోకుండా ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న విషయం రాష్ట్రం అంగీకరిస్తోందని, కానీ మృతదేహం ఇప్పటికీ లభించలేదని వ్యాఖ్యానించింది. తీసుకెళ్లిన తర్వాత ఎక్కడికి వెళ్లాడు? మృతదేహం ఏమైంది? అంటూ ప్రశ్నించింది.
సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని పిటిషనర్ వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి తరఫున సీనియర్ లాయర్ నిఖిల్ గోయల్ వాదనలు వినిపించారు. హత్య చేసి మృతదేహాన్ని కాల్చివేశారని కుటుంబ ఆరోపణలు ఉన్నాయని, టాస్క్ ఫోర్స్ బృందం నాన్-బెయిలబుల్ వారెంట్ పేరిట అదుపులోకి తీసుకుందని, ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని వాదనలు వినిపించారు. పోలీస్ స్టేషన్‌లో మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీటీవీ రికార్డులు తొలగించారని కోర్టుకు తెలిపారు.

More Stories
ఇండియన్ ఎఫ్4 రేసింగ్‌లో బోను భువన్ రికార్డు
తిరుమల లడ్డులో జంతు కొవ్వు లేదని తేల్చేసిన ఈడీ!
కృష్ణలంక పోలీసు హింసతోనే సాయికృష్ణ మృతి