ఏపీలో నాలుగు కొత్తగా పోలీస్ కమిషనరేట్లు

రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణ మరియు భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రధాన నగరాల్లో కొత్తగా పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేయడానికి ఏపీ మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో  రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  గుంటూరు, గుంటూరు రూరల్, అమరావతి క్యాపిటల్ రీజియన్, తెనాలి జోన్లతో ఏర్పాటు కానుంది.
 
తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి,   శ్రీ సిటీ జోన్లు దీని పరిధిలోకి వస్తాయి.మొత్తం మూడు ప్రత్యేక జోన్లతో విస్తరిస్తారు.  రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.2,850 కోట్లకు పైగా నిధుల అంచనా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంతోపాటు అమరావతి ఇన్‌ఫ్రా పనులకు అదనంగా రూ.644.98 కోట్లు, అసెంబ్లీ బిల్డింగ్ స్పైర్, రూఫ్, లిఫ్ట్ పనులకు రూ.661 కోట్లు కేటాయించేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.  ఎల్‌పీఎస్‌ రైతులకు కనీస యాన్యుటీ చెల్లించేలా నిబంధనల సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణంలో తదుపరి దశ పనులకు మంత్రివర్గం నిధులు కేటాయించింది. అమరావతి గ్రామ పంచాయతీల్లో క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ పనులకు పరిపాలనా అనుమతిని రూ.904 కోట్ల నుంచి రూ.1,548.98 కోట్లకు పెంచింది. 

అదనంగా రూ.644.98 కోట్లతో నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, స్టార్మ్‌ వాటర్‌ నెట్‌వర్క్‌, రోడ్లు, వీధి దీపాల పనులను విస్తరించనుంది. వివిధ సంస్థలకు భూకేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలపడంతో పాటు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో స్ట్రీట్‌ వెండర్స్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ కమిటీల ఏర్పాటుకు అనుమతించింది.  రెండో దశ భూసమీకరణలో ఎకరం కంటే తక్కువ భూమి ఇచ్చిన రైతులకు కూడా రూ.40,000 కౌలు చెల్లించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. 

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగావకాశాల కల్పనకు కేబినెట్ ప్రాధాన్యమిచ్చింది. ఇటీవల ఎస్ఐపీబీ  ఆమోదించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం తుది ముద్ర వేసింది. క్వాంటం టెక్నాలజీ రంగంలో సుమారు రూ.3,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కడపలో ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్, సృష్టి క్వాంటం, క్వాంటం కోడాన్, అరోహాక్ టెక్నాలజీస్, ట్రైక్వాంటా ల్యాబ్స్, ఫోటాన్‌కోర్ సిస్టమ్స్ కేంద్రాల ఏర్పాటు.ఐటీ రంగంలో రూ.526 కోట్లకు పైగా పెట్టుబడులు. విశాఖపట్నంలో ‘డెలాయిట్’, ‘ముత్తూట్ ఫిన్‌కార్ప్ కార్పొరేట్ ఆపరేషన్స్’ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.  

About The Author