కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 (యుఎపిఎ) కింద షాజాద్ భట్టి నెట్వర్క్ (ఎస్బిఎన్)ను ఒక ఉగ్రవాద సంస్థగా నోటిఫై చేసింది. ఉగ్రవాద సంస్థల జాబితాను కలిగి ఉన్న యుఎపిఎ మొదటి షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ మొదటి షెడ్యూల్లో షాజాద్ భట్టి నెట్వర్క్ (ఎస్బిఎన్)ను క్రమ సంఖ్య 46గా చేర్చారు.
సరిహద్దు గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడంలో అమాయక యువతను, స్థానిక నేరస్థులను భాగస్వాములను చేయడమే ఎస్బిఎన్ లక్ష్యమని ప్రభుత్వ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ కార్యకలాపాలను ప్రభుత్వం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు, మత సామరస్యానికి, అంతర్గత భద్రతకు ముప్పుగా పరిగణిస్తోందని నోటిఫికేషన్లో తెలిపారు.
షహజాద్ భట్టి నెట్వర్క్, యువతకు డబ్బు ఆశ చూపి వారిని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపించడం ద్వారా తీవ్రవాద భావజాలం వైపు మళ్లిస్తోందని ప్రభుత్వం పేర్కొంది.
ఇతర నిషేధిత సంస్థలు, నిర్దేశిత సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం వనరులను సమీకరించడంలో కూడా ఈ నెట్వర్క్ పాలుపంచుకుంటోందని అది ఇంకా పేర్కొంది. ప్రజాశాంతికి భంగం కలిగించే హింసాత్మక కార్యకలాపాల ద్వారా ఎస్బిఎన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆ నోటిఫికేషన్లో ఆరోపించారు.
ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఎస్బీఎన్ పాల్పడుతున్నట్లు కేంద్రం ఆరోపించింది. యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షిస్తోందని పేర్కొంది. ఇతర నిషేధిత సంస్థలతో కూడా ఎస్బీఎన్కు సంబంధాలున్నాయని కేంద్రం వెల్లడించింది. హింసాత్మక కార్యకలాపాలతో ఎస్బీఎన్ ప్రజాశాంతికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించింది. సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రెచ్చగొట్టే సందేశాలు వ్యాప్తి చేస్తోందని కూడా పేర్కొంది.
గత నెలలోనే ఎస్‌బీఎన్‌పై 14 రాష్ట్రాల్లో భద్రతా సంస్థలు భారీ ఆపరేషన్‌ను నిర్వహించాయి. సంస్థకు చెందిన 253 మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఎస్‌బీఎన్‌పై 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. నిందితుల నుంచి ఐఈడీలు, పిస్టళ్లు, లైవ్ కార్ట్రిడ్జ్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.
ఇటీవల బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఎస్బీఎన్ నుంచి ముప్పు ఉండవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు కూడా చేశాయి. ఈ నెట్వర్క్, దేశ సమగ్రతకు ముప్పు కలిగించేలా రెచ్చగొట్టే సందేశాలను వ్యాప్తి చేయడానికి డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తోందని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఎస్బిఎన్ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉందని, భారతదేశంలో వివిధ ఉగ్రవాద చర్యలలో పాల్గొందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

More Stories
కన్నడ లెజెండ్ అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ఛత్తీస్‌గఢ్‌లో 29 మందిని చంపిన మావోయిస్టులకు 10 మందికి మరణ శిక్ష
సెన్సార్ బోర్డులో ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి