భారతీయ సంస్కృతిలో అత్యంత గొప్ప ఇతిహాసాలలో ఒకటైన రామాయణం మరోసారి వెండితెరపై సరికొత్త రూపంలో ఆవిష్కృతమవుతుంది. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రామాయణం’ అనే పేరునే ఖరారు చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. దర్శకుడు నితేష్ తివారీ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన తొలి పోస్టర్ తో పాటుశ్రీరాముడు, సీత పాత్రలలో రణబీర్ కపూర్, సాయి పల్లవి కనిపించే ‘జై జై రామ్’ అనే మొదటి పాటను విడుదల చేశారు.‘సియా రామ్’ పోస్టర్ ఆవిష్కరణ తర్వాత వచ్చిన ఈ పాట, నితీష్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస చిత్ర ప్రచార కార్యక్రమాలకు మరింత ఊతమిస్తున్న.
పోస్టర్‌లో సీత, రాములు ఏకాంతంగా ఉన్న ఓ అందమైన సందర్భాన్ని చూపించారు. ఈ పోస్టర్‌కు సంబంధించిన సుమారు 30 సెకన్ల వీడియోను కూడా విడుదల చేయగా, ఇందులో సినిమా తెరకెక్కిస్తున్న భారీ ప్రపంచానికి కేవలం ఓ చిన్న పరిచయం మాత్రమే ఇచ్చారు. పూర్తి స్థాయి వివరాలను వెల్లడించకుండా ఆసక్తిని పెంచేలా ఈ వీడియోను రూపొందించారు.
రాబోయే రోజుల్లో సినిమా నుంచి వరుసగా కీలకమైన ప్రచార కంటెంట్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది. ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన తొలి పాటపై కూడా ఆసక్తికరమైన ప్రకటన వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ‘జై జై రామ్’ పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
రామాయణం వంటి ఇతిహాస కథకు రెహమాన్ సంగీతం అందించడం, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కూడా ఈ ప్రాజెక్ట్‌తో భాగస్వామ్యం కావడం ఆసక్తిని పెంచుతుంది. కన్నడ స్టార్ హీరో యశ్ కీలక పాత్ర పోషించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, రవి దూబే, వివేక్ ఒబెరాయ్ తదితరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం కేవలం సాధారణ పౌరాణిక కథగా కాకుండా ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రంగా ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్‌లో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన హాన్స్ జిమ్మర్ ఈ ప్రాజెక్ట్‌తో భాగస్వామ్యం కావడం విశేషంగా మారింది. ‘రామాయణం’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా, తొలి భాగాన్ని 2026 నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
More Stories
బ్రిక్స్ విందుకు ప్రతిపక్ష ముఖ్యమంత్రుల గైరాజర్!
ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో 2029లోపు ఉమ్మడి పౌరస్మృతి
మూడు రోజుల్లో 15 ద్వైపాక్షిక సమావేశాలు జరిపిన మోదీ