జాతీయ రాజధానిలో ముగిసిన రెండు రోజుల బ్రిక్స్ సమావేశానికి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవ్వరూ హాజరు కాలేదు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులందరికీ ఆహ్వానం పంపినా వారంతా సమావేశానికి గైర్హాజరు కావడానికి అధికారిక వివరణ ఇవ్వన్నప్పటికీ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ సుఖుకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని ఆ రాష్ట్రాల వర్గాలు తెలిపాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర ప్రదేశ్), దేవేంద్ర ఫడ్నవిస్ (మహారాష్ట్ర), సువేందు అధికారి (పశ్చిమ బెంగాల్), హిమంత బిస్వా శర్మ (అస్సాం), పుష్కర్ సింగ్ ధామి (ఉత్తరాఖండ్), రేఖా గుప్తా (ఢిల్లీ) — న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన విందులో పాల్గొన్నారు.
కేరళ ముఖ్యమంత్రి విడి సతీసన్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే, ప్రతిపక్షం 2024 జూలైలో జరిగిన నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశంతో సహా అంతకుముందు జరిగిన అనేక సమావేశాలకు గైర్హాజరైంది.
కేంద్ర బడ్జెట్‌ను నిరసనగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సహా ఇండియా కూటమికి చెందిన కొందరు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలు, తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కొదఈ సమావేశాన్ని బహిష్కరించారు. 2023లో, న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించిన జీ20 విందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ దూరంగా ఉన్నారు. అయితే, ఎం.కె. స్టాలిన్‌తో సహా ఇండియా బ్లాక్‌కు చెందిన పలువురు ఇతర నాయకులు హాజరయ్యారు.
బ్రిక్స్ సదస్సు సాధించిన విజయాలు, చేసిన ప్రకటన అంచనాలకు చాలా తక్కువగా ఉన్నాయని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. అరుణాచల్, లడఖ్ లేదా పహల్గామ్ ఉగ్రదాడి గురించి కూడా ప్రస్తావించకపోవడంతో ఇది ‘విజయం’ కాదని స్పష్టమైందని ఆ పార్టీ పేర్కొంది. ‘అరుణాచల్, లడఖ్ వంటి భూభాగాలను చైనా ఆక్రమించుకున్న తీరును దృష్టిలో ఉంచుకుని, ప్రధానమంత్రి సూటిగా మాట్లాడి చైనా వైదొలగాలని డిమాండ్ చేయాలి. ఈ శిఖరాగ్ర సమావేశం ద్వారా భారతదేశం పొందగలిగే గొప్ప ప్రయోజనం అదే అవుతుంది,” అని కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే విమర్శించారు.
కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఇలా పేర్కొన్నారు: “విడుదలైన ‘ఢిల్లీ డిక్లరేషన్’ ఉగ్రవాదాన్ని, పహల్గామ్ ఘటనను ఖండిస్తోంది, కానీ పహల్గామ్ దాడికి ఎవరు పాల్పడ్డారో అందులో ఎక్కడైనా పేర్కొన్నారా? ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ఎవరు పాల్పడుతున్నారో ఎక్కడైనా ప్రస్తావించారా? వాటి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు.”

More Stories
ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో 2029లోపు ఉమ్మడి పౌరస్మృతి
మూడు రోజుల్లో 15 ద్వైపాక్షిక సమావేశాలు జరిపిన మోదీ
252 మదర్సాల మూసివేతకు బెంగాల్ ప్రభుత్వం ఆదేశం