పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇస్లామిక్ విద్యాసంస్థల (మదర్సాల) వివరాలను పరిశీలిస్తున్న క్రమంలో, 252 మదర్సాలకు మూసివేత నోటీసులు జారీ చేసింది. సమీక్షా ప్రక్రియలో భాగంగా మొదటి దశలో మరో వంద మదర్సాలకు ‘షో-కాజ్’ నోటీసులు పంపారు. మూసివేతకు గురవుతున్న ఆ 252 మదర్సాలలో ఎక్కువ భాగం ‘ఖారిజీ’ వర్గానికి చెందినవని నివేదికలు సూచిస్తున్నాయి.
వీటిలో కనీసం 44 మదర్సాలు మాల్డాలో, 37 ఉత్తర దినాజ్‌పూర్‌లో, 32 దక్షిణ 24 పరగణాల్లో, అలాగే నాడియా, ముర్షిదాబాద్‌లలో చెరో 25 చొప్పున ఉన్నాయి. నోటీసులు అందుకున్న మదర్సాలు తప్పనిసరిగా సరైన అనుమతి పత్రాలను సమర్పించాలని, లేనిపక్షంలో వాటిని మూసివేస్తామని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఖుదిరామ్ టుడు హెచ్చరించారు.
రాష్ట్రంలో గుర్తింపు పొందిన, గుర్తింపు లేని మదర్సాల సంఖ్యను నిర్ధారించడానికి ముఖ్యమంత్రి సువేందు అధికారి జూన్ నెలలో రాష్ట్రవ్యాప్త సర్వేకు ఆదేశించారు. ఆ తర్వాత, మదర్సాల నిర్వహణ విధానాలు, విద్యార్థుల నమోదు వివరాలు, నిధుల వనరులు, రిజిస్ట్రేషన్ స్థితిని పరిశీలించడానికి కోల్‌కతా, ఇతర 22 జిల్లాల్లో మైనారిటీ వ్యవహారాల, మదర్సా విద్యా శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు.
“సర్వే ఫలితాల ఆధారంగా, మొదటి దశలో 252 మదర్సాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాము. అదనంగా, తీవ్రమైన అక్రమాలు గుర్తించిన మరో 100 మదర్సాలకు షో-కాజ్ నోటీసులు పంపాము. ఒకవేళ ఈ సంస్థలు సరైన ఆధారాలు లేదా అనుమతి పత్రాలను సమర్పించడంలో విఫలమైతే, వాటిని మూసివేసే చర్యలు తీసుకుంటాము” అని టుడు పేర్కొన్నారు.
ప్రస్తుతం బెంగాల్‌లో సరైన అనుమతితో 2,132 మదర్సాలు నడుస్తుండగా, అనుమతి లేని మదర్సాల సంఖ్య 2,396గా ఉందని ఆయన తెలిపారు. మదర్సాలపై తీసుకున్న ఈ చర్య బెంగాల్ రాజకీయాల్లో వాదోపవాదాలకు దారితీసింది. సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న ‘తీవ్రవాద భావజాల వ్యాప్తి’ కార్యకలాపాలను ప్రస్తావిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రభుత్వ చర్యను సమర్థించారు.
“మదర్సా విద్య ముసుగులో జరుగుతున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడం ప్రభుత్వ బాధ్యత. అందుకే ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది” అని ఆయన పేర్కొన్నారు. బెంగాల్ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర పాల్ కూడా మదర్సాలపై తీసుకున్న చర్య సమంజసమేనని చెప్పారు.
ఇటువంటి సంస్థలు “దేశ వ్యతిరేక విద్యను ప్రోత్సహిస్తున్నాయని” ఆమె ఆరోపించారు. “బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదులు ఇలాంటి స్వతంత్ర మదర్సాలలో ఆశ్రయం పొందే వారు. మేము విద్యా విధానాన్ని క్రమబద్ధీకరించాలనుకుంటున్నాము,

More Stories
బ్రిక్స్ విందుకు ప్రతిపక్ష ముఖ్యమంత్రుల గైరాజర్!
ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో 2029లోపు ఉమ్మడి పౌరస్మృతి
మూడు రోజుల్లో 15 ద్వైపాక్షిక సమావేశాలు జరిపిన మోదీ