విద్యార్థులు మొబైల్ ఫోన్లు కొనుక్కునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేయబోతున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. బీజేపీకి ముందు బెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ తరుణేర్ స్వప్నో అనే పథకాన్ని 2022లో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 11, 12 తరగతులు (ఇంటర్) చదివే విద్యార్థులు మొబైల్ ఫోన్లు కొనుక్కునేందుకు ఏకమొత్తం ఆర్థిక సాయం అందించేవారు.
ఫోన్లు కొనుక్కోవడానికి రూ.10,000 అందించేవారు. తమ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించబోదని చెబుతూ దాని బదులు విద్యార్థులకు మరిన్ని మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గుజరాత్‌లోని స్కూళ్లలో ఇంటర్ విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు మొబైల్ ఫోన్లు తీసుకు వెళ్లడాన్ని నిషేధించారని ఆయన గుర్తు చేశారు.
విద్యార్థులు మొబైల్ ఫోన్లను దూరంగా ఉంచడం వల్లే చదువుపై ఏకాగ్రతతో ఉంటారని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థులకు మొబైల్స్ అందిస్తే విద్యార్థులు ఫోన్లను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు రాత్రి త్వరగా నిద్రపోయినా విద్యార్థులు మాత్రం రాత్రిపూట మొబైల్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మొబైల్ ఫోన్ల పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

More Stories
భేదాభిప్రాయాలు వివాదాలుగా మారకూడదని భారత్, చైనా ప్రకటన
బెదిరింపు లేఖలపై దర్యాప్తు, రక్షణ కోరిన కాశ్మీరీ పండిట్లు
బహుపాక్షిక వ్యూహం ద్వారా అంతర్జాతీయ వివాదాల పరిష్కారం