ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎత్తున్న మావోయిస్టుల డంప్‌లను భద్రతా బలగాలను స్వాధీనం చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన 14 డంప్‌లను భద్రతా బలగాలు గుర్తించి, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఆర్పిఎఫ్ అధికారులు సోమవారంనాడు వెల్లడించారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకునేందుకు మావోయిస్టులు గతంలో దాచిపెట్టినట్లు భావిస్తున్న ఈ సామగ్రిలో పలు రకాల రైఫిళ్లు, డిటోనేటర్లు, ఐఈడీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రాన్ని మావోయిస్టుల రహితంగా ప్రకటించిన నేపథ్యంలో బస్తర్ ప్రాంతవ్యాప్తంగా భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. బస్తర్‌లోని ఏడు జిల్లాల్లో బీజాపూర్ ఒకటి. సీఆర్పీఎఫ్కు చెందిన 199వ బెటాలియన్ ఆధ్వర్యంలో గాలింపు చర్యల్లో ఎడీ, హర్రీ, నయాపారా, సర్పంచ్పారా పిడియా, కువాపగూడ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో డంప్‌లను గుర్తించినట్లు సీఆర్పీఎఫ్ అధికారి తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వాటిలో ఏడు రైఫిళ్లు, 303 బోల్ట్-యాక్షన్ రైఫిల్, ఐదు మజిల్-లోడింగ్ రైఫిళ్లు, స్థానికంగా తయారు చేసిన ఒక 12-బోర్ రైఫిల్ ఉన్నాయి. వీటితో పాటు ఎనిమిది డిటోనేటర్లు, 10 ఐఈడీలు, కోడెక్స్ వైర్, బ్యాటరీ లేని వైర్లెస్ సెట్, నాలుగు ప్లాస్టిక్ కంటైనర్లు, మూడు పెద్ద స్టీల్ కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఐఈడీల తయారీకి ఉపయోగించే సామగ్రి, విద్యుత్ పరికరాలు, మావోయిస్టుల దుస్తులు తదితర 99 రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారి వెల్లడించారు.

More Stories
నర్మదా తీరంలో ‘జాతీయ చలనచిత్ర అవార్డుల’ వేడుక
పీజీ హాస్టళ్లలో భద్రత, కనీస సౌకర్యాలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
ఉత్తరాఖండ్‌లో జన్మాష్టమికి ‘లవ్ జిహాద్’ ప్రదర్శనపై రాజకీయ దుమారం