ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్) నుండి సుమారు రూ. 980 కోట్ల రుణం తీసుకున్న వ్యవహారంలో, ఎస్సెల్ గ్రూప్ మాజీ చైర్మన్,
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఇతరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఉల్లంఘన, అక్రమ లబ్ధి పొందడం వంటి ఆరోపణలు సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. తప్పుడు,
ఈ వ్యవహారంలో ఒక ముఖ్యమైన అంశం సుభాష్ చంద్ర ‘నికర విలువ’ లేదా మొత్తం ఆస్తులకు సంబంధించినది. ఫిర్యాదు ప్రకారం, రెండు వేర్వేరు రుణాలకు హామీదారుగా వ్యవహరించినప్పుడు సుభాష్ చంద్ర సమర్పించిన నికర విలువ ధృవీకరణ పత్రాలలో, తన ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలని పేర్కొన్నారు. అయితే, తదనంతరం జరిగిన వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో, తన వాస్తవ నికర విలువ అంత ఎక్కువగా లేదని చెబుతూ చంద్ర స్వయంగా ఆ గణాంకాలను ప్రశ్నించారు.
ఆ దివాలా ప్రక్రియ సమయంలో, నికర విలువ ధృవీకరణ పత్రాలలో పేర్కొన్న గణాంకాలను తన వాస్తవ ఆస్తులుగా అంగీకరించడానికి సుభాష్ చంద్ర నిరాకరించారు. దివాలా ప్రక్రియలో, 2024 సంవత్సరానికి తన నికర విలువ సుమారు రూ. 31.79 కోట్లుగా సుభాష్ చంద్ర ప్రకటించారని ఫిర్యాదు పేర్కొంది. అంతేకాకుండా, 2017-18లో కూడా తన నికర విలువ రూ. 40,000 కోట్లకు మించలేదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
ఈ గణనీయమైన వ్యత్యాసం ఇప్పుడు సిబిఐ దర్యాప్తులో కీలక భాగంగా మారింది. అలాగే, సుమారు రూ. 980 కోట్ల రుణ మొత్తాన్ని ఏ నిర్దిష్ట ప్రయోజనం కోసం మంజూరు చేశారో, దానికే వినియోగించారా లేదా అనే విషయాన్ని కూడా సంస్థ పరిశీలిస్తుంది. ఈ రూ. 1,322 కోట్ల బారీ రుణాల రికవరీ మరియు సెటిల్మెంట్కు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇటీవల వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆ తీర్పుపై పెను విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలోనే సీబీఐ రంగంలోకి దిగి క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది.

More Stories
ప్రత్యేక సుంకాల మినహాయింపులు ఇస్తేనే అమెరికాతో తుది ఒప్పందం
ప్రసూతి సెలవుపై వెడితే హోదా తగ్గిస్తారా?… రూ. 10 లక్షల జరిమానా
వచ్చే 10 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు