తమిళనాడులో జోసఫ్ విజయ్ ఆధ్వర్యంలోని అధికార టీవీకే కూటమిలో 2029 ఎన్నికలలో ప్రధాన మంత్రి అభ్యర్థి విషయంలో ప్రధాన భాగస్వాములైన కాంగ్రెస్, టీవీకే పార్టీల మధ్య వివాదం నడుస్తోంది. 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయ్ ప్రధాని అభ్యర్థిగా ఉంటారంటూ టీవీకే నేతలు చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం కలిగిస్తోంది.
పైగా ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో విజయ్న ప్రధాని అభ్యర్థిగా 9 శాతం మంది అంగీకరిస్తున్నట్లు వెల్లడైంది. 2029లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి విజయ్ మద్దతు ఇవ్వాలని, లేని పక్షంలో మంత్రివర్గం నుండి వైదొలుగుతామని కాంగ్రెస్ మంత్రులు స్పష్టం చేస్తున్నారు.
2029 లోక్‌సభ ఎన్నికలకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా టీవీకే సమర్థించకపోతే, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే)తో ఉన్న పొత్తు నుండి కాంగ్రెస్ వైదొలుగుతుందని తమిళనాడు మంత్రి ఎస్. రాజేష్ కుమార్ హెచ్చరించారు.
ఈ విషయంలో టీవీకే కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వకపోతే, తాను, తన మంత్రివర్గ సహచరుడు పి. విశ్వనాథన్ (ఉన్నత విద్యాశాఖ మంత్రి) తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కిల్లియూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికలకు విజయ్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా టీవీకేకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతిపాదిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని కుమార్ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయి. “2029 లోక్‌సభ ఎన్నికల తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీనే తదుపరి ప్రధానమంత్రి అవుతారు. ఒకవేళ టీవీకే ఆయనను తిరస్కరించాలని నిర్ణయించుకుంటే, మా ఇద్దరు మంత్రులు మంత్రివర్గం నుండి వైదొలుగుతారు. మా పార్టీయే మాకు అత్యంత ప్రాధాన్యత అని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము,” అని రాజేష్ తెలిపారు.

More Stories
పోర్నోగ్రఫీ వెబ్సైట్లు ఉపయోగిస్తున్న జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు
హాస్యనటుల వ్యాఖ్యలపై కాశీరీ పండిట్ల ఆగ్రహం
కోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు మమతపై ఎఫ్ఐఆర్