గత బీఆర్ఎస్ పాలనలో ‘ధరణి’, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ‘భూభారతి’ పేరుతో రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురిచేస్తూ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2018 ధరణి నుంచి నేటి 2025-26 భూభారతి వరకు జరిగిన భూ లావాదేవీలు, 22ఏ నిషేధిత భూముల వెనుక ఉన్న భారీ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని ‘సెక్షన్ 22ఏ’ (నిషేధిత భూములు) నిబంధనను ఒక పెద్ద భూతంలా చూపిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల ఆస్తులను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని నిప్పులు చెరిగారు. ధరణికి పూర్వం ఉన్న రికార్డులను యథాతథంగా కొనసాగించాలి. సెక్షన్ 22ఏ కింద ప్రొహిబిట్ చేసిన ప్రైవేట్, సాధారణ ప్రజల భూములన్నింటినీ తక్షణమే తొలగించి ‘ఫ్రీ హోల్డ్’ చేయాలని కోరారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం వెంటనే స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూకట్పల్లి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, బాధితులు రాంచందర్ రావును కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. కూకట్పల్లి వసంత్ నగర్ వంటి ప్రాంతాల్లో మిడిల్ క్లాస్ కుటుంబాలు కొనుగోలు చేసిన ఫ్లాట్లు, ఆరుట్ల గ్రామంలోని దాదాపు 1,100 ఎకరాల సాధారణ భూములు రాత్రికి రాత్రే 22A నిషేధిత జాబితాలోకి చేరడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ మహానగరంతో పాటు శివారు ప్రాంతాల్లో దాదాపు 60 నుంచి 70 శాతం మంది ప్రజలు ఈ సమస్యతో ప్రత్యక్షంగా నష్టపోతున్నారని రాంచందర్ రావు మండిపడ్డారు. పైసలు చెల్లించి రిజిస్ట్రేషన్లు పూర్తయిన భూములను కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి ఎన్వోసీల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని, ప్రజలు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని దుయ్యబట్టారు.

More Stories
’భూ భారతి’ మంత్రులకు వజ్రాల హారతి
తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు.. బిజెపి 7 డిమాండ్లు
ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ కు డాక్టర్ వైఎస్.అవార్డు – 2026