కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్ష రాసిన అభ్యర్థులు, వందల మంది విద్యార్థులు మంగళవారం పట్నాలోని బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి నివాసం వైపు ర్యాలీ తీశారు. అడ్డుగా ఉన్న బారికేడ్లను దాటారు. ఈ సందర్భంగా 70వ బీపీఎస్‌సీ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. వాటర్ క్యానన్లను ప్రయోగించారు. అయినప్పటికీ వారు ముఖ్యమంత్రి నివాస సమీపానికి చేరుకున్నారు. భూ సంబంధిత సమస్యలపై రైతు సంఘం నల్ల జెండాలు పట్టుకుని ఈ ఆందోళనలో చేరడంతో సీఆర్‌పీఎఫ్ బలగాలు మోహరించాయి. బీపీఎస్‌సీ-టీఆర్‌ఈ 4 ఒకే పరీక్ష, ఉద్యోగ నియమకాల్లో పారదర్శకత, హిందీ మీడియం విద్యార్థులకు బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (బిఎస్ఎస్‌సీ) పరీక్షల్లో సమాన అవకాశాలు కల్పించడం వంటి డిమాండ్లతో విద్యార్థులు, అభ్యర్థులు కొన్ని రోజులుగా పట్నాలోని గార్డనిబాగ్‌లో ఆందోళన చేపడుతున్నారు.
గర్దనీబాగ్ వద్ద విద్యార్థులు లేవనెత్తిన 15 డిమాండ్లకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించే కార్యక్రమాన్ని ‘ఛాత్ర-యువ సంఘర్ష మోర్చా’ ప్రకటించడంతో పాటు, బీహార్‌వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువత భారీ సంఖ్యలో ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చింది. బిహార్ ప్రభుత్వంతో విద్యార్థి ప్రతినిధులు జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయని విద్యార్థి నాయకుడు సౌరవ్ కుమార్ చెప్పినప్పటికీ తమ అన్ని డిమాండ్ల సాధన కోసం ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు, అభ్యర్థులు నిర్ణయించుకున్నారు.
దీంతో సీఎం నివాసం వైపు ర్యాలీ తీయగా పోలీసులు, వారికి మధ్య ఘర్షణ నెలకొంది. కింది స్థాయి అధికారులతో చర్చలు జరిపించి తరువాత తమ సమస్యను మరిచిపోతున్నారని ఆరోపించారు. కాబట్టి బిహార్ సీఎం లేదా డిప్యూటీ సీఎంతో చర్చలకు అవకాశం కల్పించి, సమస్యలపై అధికార ప్రకటన చేస్తేనే తమ నిరసన విరమిస్తామని విద్యార్థి నాయకుడు ఒకరు వెల్లడించారు.
సీఎంను కలిసేందుకు అనుమతించాలన్నదే వారి ప్రధాన డిమాడ్, విద్యాశాఖ మంత్రి కలిసే అవకాశం కల్పించడం అనేది రెండో ప్రత్యామ్నాయం. అంతే తప్ప ఇంకెవ్వరినీ కలవం అని ఆ విద్యార్థి నాయకుడు స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి స్పందిస్తూ విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లేలా ప్రతి నెలా నాలుగో మంగళవారం విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
నేటి నుంచి ప్రభుత్వం ‘విద్యార్థి సహ్యోగ్ శిబిరం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదేవిధంగా ఆన్‌లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చవని, ప్రత్యేక పోర్ట్, హెల్ప్ లైన్ నంబర్ 1100 ద్వారా వాటి స్థితిని తెలుసుకోవచ్చని వెల్లడించారు.

More Stories
ఊర్వశి రౌతేలా త్రివర్ణ రంగుల గౌన్ పై దుమారం
మంత్రి నాగేంద్ర రాజీనామాకై బిజెపి కర్ణాటక విధాన సౌధ ముట్టడి
`ఒకే దేశం, ఒకే ఎన్నిక’కు 99 శాతం మంది మద్దతు