రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్లకి పార్టీలో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖకు నోటీసులు ఇస్తే, నా బిడ్డ మాటలకు నాకు సంబంధం లేదని బుకాయిస్తుందని ఆరోపించారు. సంబంధం లేకపోతే ముఖ్యమంత్రిపై కూతురు చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతున్న తప్పుడు భాషకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తున్నారని, ఆమె మాత్రం తన పదవిని ఎంజాయ్ చేస్తూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారని అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, బీర్ల ఐలయ్య, మధుసూదన్ రెడ్డి , రేవూరి ప్రకాష్ రెడ్డి , దొంతి మాధవరెడ్డి, మందుల సామెల్ , వెడ్మ బొజ్జు , వేముల వీరేశం, బుయ్యని మనోహర్ రెడ్డి , కూచుకుళ్ల రాజేష్ రెడ్డి , బత్తుల లక్ష్మా రెడ్డి , బాలు నాయక్ , వీర్లపల్లి శంకర్ , కుంభం అనిల్ కుమార్ రెడ్డి , చిక్కుడు వంశీకృష్ణ ,బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్లకి పార్టీలో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖకు నోటీసులు ఇస్తే, నా బిడ్డ మాటలకు నాకు సంబంధం లేదని బుకాయిస్తుందని ఆరోపించారు. సంబంధం లేకపోతే ముఖ్యమంత్రిపై కూతురు చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతున్న తప్పుడు భాషకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తున్నారని, ఆమె మాత్రం తన పదవిని ఎంజాయ్ చేస్తూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారని అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకోవైపు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి స్కీంలో విలీనం చేసే ఆలోచనపై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలతో భాగంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చెన్నూరు పట్టణంలో కార్మిక శాఖ మంత్రి వివేకా వెంకటస్వామి ఇంటికి వెళ్లి వినతిపత్రం ఇస్తూ స్పష్టమైన హామీ ఇవ్వమని కోరగా ఆయన నిర్వేదంగా ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది. “నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఇప్పుడు మంత్రిగా నేను ఉన్నా.. రేపు నేను ఓడిపోతా..మా ప్రభుత్వం పోతది..నా గ్యారెంటీతో మీకేం ఫాయిదా?” అంటూ స్పష్టం చేశారు.
మరోవంక, ముఖ్యమంత్రి దేశంలో లేని సమయంలో అసంతృప్త నేతలు, ఎమ్మెల్యేలు మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్ లో రహస్య భేటీ జరిపినట్లు తెలుస్తున్నది. వారికి పలువురు మంత్రులు కూడా మద్దచెబుతున్నారుతు ఇరుతుస్తున్నారని . 15-18 మంది ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో ఇద్దరు రేవంత్‌రెడ్డి క్యాబినెట్ సహచరులు కూడా పాల్గొన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నది.
ఇటీవల ప్రభుత్వంపై తీవ్రస్థాయి లో విరుచుకుపడుతున్న ఓ మాజీ ఎంపీకి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో గురువారం ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ నేతలు కలుసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహారశైలి, ఆయన సోదరులపై వస్తున్న ఆరోపణలు, పాలనా వివాదాలు ఫామ్‌హౌస్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులే లాభపడుతున్నారని, పార్టీకి సుదీర్ఘంగా సేవలందించిన తమలాంటి వారికి ఒరిగిందేమీ లేదని వారంతా నిర్వేదం వ్యక్తం చేశారని చెబుతున్నారు.

More Stories
అమెరికాలో ట్రంప్ తో భేటీకి రేవంత్ రెడ్డి ప్రయత్నించారా?
రేవంత్ అమెరికా పర్యటన అనుమతిపై అనవసర రాద్ధాంతం
వారంలో 10 బిలియన్ డాలర్లు పెరిగిన విదేశీ మారక నిల్వలు