రెండు నౌక‌లు హైజాక్ .. 22 మంది భార‌తీయులు క్షేమం

రెండు నౌక‌లు హైజాక్ .. 22 మంది భార‌తీయులు క్షేమం

* 21 మంది భారతీయులున్న నౌకపై ఏప్రిల్ లో ఇరాన్ దాడి వీడియో  

రెండు నౌక‌ల‌ను పైరేట్స్ హైజాక్ చేశారు. ఆ నౌక‌ల్లో 22 మంది భార‌తీయులు ఉన్నారు. యెమెన్, సోమాలియా తీరాల్లో ఆ నౌక‌ల‌ను హైజాక్ చేసిన‌ట్లు సీనియ‌ర్ షిప్పింగ్ మినిస్ట్రీ అధికారి ఒక‌రు చెప్పారు. ఆయిల్ ట్యాంక‌ర్‌తో ఎరిత్రియాకు వెళ్తున్న ఎంటీ సిబు 1 నౌక‌లో సుమారు 20 మంది సిబ్బంది ఉన్నారు. దీంట్లో 16 మంది భార‌తీయులు అని తెలిసింది. అయితే గ‌ల్ఫ్ ఆఫ్ ఎడ‌న్ వ‌ద్ద స‌ముద్ర దొంగ‌లు ఆ నౌక‌ను హైజాక్ చేసిన‌ట్లు గుర్తించారు. 

ఆగ‌స్టు 20వ తేదీన యెమెన్ తీరానికి సుమారు 30 నాటిక‌ల్ మైళ్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కెమెరూన్‌కు వెళ్తున్న మ‌రో కార్గో షిప్‌ను కూడా పైరేట్స్ హైజాక్ చేశారు. సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ కోస్టు వ‌ద్ద ఆగ‌స్టు 17వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 10 మంది ఉన్న ఆ నౌక‌లో ఆరుగురు భార‌తీయులే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం రెండు నౌక‌ల‌కు చెందిన భార‌తీయులు క్షేమంగా ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.
 
ఇలా ఉండగా, ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద గత ఏప్రిల్‌లో భారతీయులున్న ఒక నౌకపై ఇరాన్ దాడి జరిపిన వీడియో ఇప్పుడు విడుదలైంది. ఒక భారీ వాణిజ్య నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా, అందులో 21 మంది భారతీయులున్నారు. ఈ నౌకపై ఇరాన్‌కు చెందిన సైన్యం అయిన ఐఆర్‌జీసీ (ఇరాన్స్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్) దాడి చేసింది. చిన్న చిన్న బోట్లలో వచ్చిన ఐఆర్‌జీసీ సిబ్బంది నౌకలపై దాడికి పాల్పడ్డారు. ఇ
 
ది భారతీయ సిబ్బంది ఉన్న పనామా నౌక. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్ని నౌకలోని సిబ్బంది వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియోను ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌యూఐ) సంస్థ విడుదల చేసింది. 
 
ఇదొక ఇబ్బందికరమైన పరిస్థితి అని వ్యాఖ్యానించింది. ఇలాంటి సందర్భాల్లో జారీచేసే మార్గదర్శకాలు, సూచనలు నౌకలోని సిబ్బందిని రక్షించలేవని, నావికా దళాలు వారి భద్రతకు హామీ ఇవ్వాలని ఎఫ్‌ఎస్‌యూఐ వ్యాఖ్యానించింది. దాడి సమయంలో సిబ్బంది లోపల దాక్కున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఈ దాడి అనంతరం తాము రెండు విదేశీ నౌకల్ని దిగ్బంధించామని ఇరాన్ ప్రకటించింది.