ఈ హత్య వెనుక ఆర్థిక వివాదాలే ప్రధాన కారణమని షంసో తండ్రి ఫజల్ సాహిబ్జాదా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌసర్, జావేద్ అనే వ్యక్తులతో తన కుమార్తెకు ఉన్న ఆర్థిక లావాదేవీల్లో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినందుకు ఆమెను చంపేస్తామని గతంలో బెదిరించారని పేర్కొన్నారు. ఘటనకు ముందు కాషిఫ్ అనే వ్యక్తి నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ హత్య కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి పరారీ కోసం సాయం చేసిన ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. కనీసం నాలుగేళ్ల నుంచి బీబీ టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నది. ఓ దుస్తుల కంపెనీకి బ్రాండ్ ప్రమోషన్ కూడా చేస్తోంది.
గడిచిన ఏడాది కాలంలో పాకిస్థాన్‌లో ఐదుగురు మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్లు హత్యకు గురికావడం గమనార్హం. 2025లో 17 ఏళ్ల సనా యూసఫ్‌ను కూడా ఇదే తరహాలో కాల్చి చంపారు. కాగా, ఈ ఘటన తర్వాత కుటుంబ సభ్యులు షంసో బీబీకి చెందిన టిక్‌టాక్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు.

More Stories
మహిళల ఆసియా కప్‌లో పదో సారి ఫైనల్‌కు భారత్
రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి ఒక్కరికి రూ.4 లక్షలు.. ట్రంప్ సంచలన హామీ
బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రహమాన్ దూరం