“మీరు చెప్పారనే నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం. ఎన్నికల ముందు మీరు మా ఇండ్లకు వచ్చి మద్దతు అడిగారా? లేదా? మాతో బస్సు యాత్రలకు జెండాలు ఊపించారు కదా! అప్పుడు మా ఉద్యోగాల కోసం ఎగిరెగిరి గొంతెత్తారు. ఇప్పుడు ఏమైం ది మీ గొంతుకు? మేం ఎందుకు గుర్తుకు రావ డం లేదు?” అంటూ ఆయన వచ్చీరాగానే ఎదురెల్లిన నిరుద్యోగులు అడ్డుకొని ప్రశ్నల వర్షం కురిపించారు.
గత శాసనసభ ఎన్నికల సమయంలో మీరిచ్చిన పిలుపును నమ్మి తామంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించామని నిరుద్యోగులు కోదండరాంకు గుర్తుచేశారు. ‘మీ మాటలు నమ్మి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తే, ఇప్పుడు ఆ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరెందుకు మౌనంగా ఉన్నారు?’ అంటూ నిలదీశారు. తమ హక్కుల సంగతేంది అంటూ ప్రశ్నిస్తూ నిరుద్యోగుల సమస్యలపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని వెంటపడటంతో ఒక్కసారిగా కోదండరాం కంగుతిన్నా రు.
“ఎమ్మెల్సీవై ఏం ఒరగబెట్టావ్? మీరు రాజీనామా చేయండి.మా ఉద్యోగాల నోటిఫికేషన్‌పై ఎం దుకు మాట్లాడటం లేదు? నిరుద్యోగుల సమస్యలపై మౌనమెందుకు? సీఎం రేవంత్‌రెడ్డి అంటే భయమా?” అంటూ కోదండరాంనుని రుద్యోగుల ప్రశ్నలతో కడిగిపారేశారు. తమ సమస్యలను మీడియా కూడా సరిగా కవర్ చేయడం లేదని పేర్కొంటూ నిరుద్యోగుల గోడు ప్రభుత్వం వరకు చేర్చేలా మీడియాకు స్పష్టంగా చెప్పాలని కోదండరాంను డిమాండ్ చేశారు.
ఉద్యోగ వయోపరిమితి పెంపు విషయంలో తమ భవిష్యత్తు నాశనమవుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ఆయనను నిలదీశారు. ఈ ప్రశ్నల పరంపరతో కోదండరాం నీళ్లు నమిలారు. “ఇది సమయం కాదు. నాకు ముఖ్యమైన మీడియా సమావేశం ఉన్నది” అంటూ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి ఉడాయించేందుకు యత్నించారు. నిరుద్యోగుల ఆవేదనతో కూడిన ప్రశ్నలకు ఆయన బదుల్విలేకపోయారు.
ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారికి సమాధానం చెప్పలేక, స్పష్టమైన హామీ ఇవ్వలేక మౌనంవహిస్తూ సెమినార్‌లో పాల్గొనకుండానే అకడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈలోగా పోలీసులు రంగప్రవేశం చేసి నిరుద్యోగులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో నిరుద్యోగులు, పోలీసుల మధ్య తోపులాట జరుగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పలువురు నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు.

More Stories
ఎర్రకోట కారు బాంబు దాడిలో అల్-ఖైదా.. ఐరాస నివేదిక
ఎన్నికల సంఘం వెరిఫికేషన్ పేరుతో రూ. 3.27 లక్షల సైబర్ మోసం
కమీషన్ కోరారని భట్టి భార్యపై గవర్నర్‌కు ఫిర్యాదు!