కానీ, కేంద్రం అమలు చేస్తున్న ఇథనాల్ పాలసీ వల్ల, చమురు కొనుగోలులో కంపెనీలు అనుసరించిన వ్యూహాల వల్ల పెట్రోల్ ధరలు రూ.94.77 వరకే ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో ఉత్పత్తి అయిన ఇథనాల్‌ను పెట్రోల్‌లో 20 శాతం కలపడం వల్ల పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయని కేంద్రం అభిప్రాయపడింది. సామాన్యుడికి ప్రతి లీటర్‌కు రూ.30 వరకు మిగిలాయని చెబుతోంది. అది కూడా చమురు సంక్షోభం తీవ్ర స్థాయికి చేరిన సమయంలో ఈ ధరలున్నాయని కేంద్రం చెప్పింది. ప్రస్తుత విధానంతో ఢిల్లీలో లీటర్ ధర రూ.94.77కే పరిమితమైందని పేర్కొంది.
ఇథనాల్ కలిపే ఉద్దేశం దేశ ప్రజలకు తక్కువ ధరకు చమురు ఇవ్వడం కాదని, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల ప్రభావం కనిపించకుండా ఉండటానికి, భారత చమురు రంగానికి భద్రత కల్పించానికి అని కేంద్రం వివరించింది. భారత నిధుల్ని చమురు కోసం విదేశాలకు చెల్లించకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కూడా దీని లక్ష్యమని కేంద్రం వెల్లడించింది.
ఇప్పటివరకు అమలు చేసిన ఈ కార్యక్రమం ద్వారా రూ.1.97 లక్ష కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని కేంద్రం తెలిపింది. అలాగే పర్యావరణానికి మేలు చేస్తూ 950 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని, రైతులు మరియు డిస్టిలరీలకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు అందాయని వివరించింది.
ఇథనాల్ తయారీ కోసం ఆహార భద్రతకు ఎటువంటి భంగం కలగకుండా కేవలం మిగులు ధాన్యాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), ఇతర సంక్షేమ పథకాలకు కేటాయించిన ధాన్యాన్ని ఎక్కడా మళ్లించడం లేదని, కేవలం మానవ వినియోగానికి పనికిరాని, విరిగిన బియ్యాన్ని మాత్రమే ఇథనాల్ ఉత్పత్తికి వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

More Stories
పీఎం కిసాన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు
‘సముద్ర మంథన్’కు రూ 84,084 కోట్లు కేటాయింపు
ఈ20 పెట్రోల్ వల్ల మైలేజీ 2-6 శాతం తగ్గవచ్చు