పశ్చిమ ఆసియాలో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాయుధ ఘర్షణలు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ యుద్ధ ప్రభావం చమురు సరఫరాపై విపరీతంగా పడుతోంది. ముఖ్యంగా భారతదేశ ఇంధన భద్రత, సరఫరా మార్గాల స్వరూపాన్ని ఇది పూర్తిగా మారుస్తోంది. యుద్ధం కారణంగా ఎదురవుతున్న తీవ్రమైన ప్రమాదాలను నివారించేందుకు భారతీయ రిఫైనరీలు, చమురు దిగుమతిదారులు సరికొత్త వ్యూహాత్మక మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఈ ప్రాంతం నుండి ఇంధన సరఫరాలను సురక్షితంగా భారతదేశానికి చేర్చడానికి, వారు సాంప్రదాయకంగా ఉపయోగించే అత్యంత సంక్లిష్టమైన హార్ముజ్ జలసంధి షిప్పింగ్ మార్గానికి వెలుపల ఉన్న ఒమన్ గల్ఫ్ వెంబడి గల ఓడరేవులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన ఫుజైరా, ఖోర్ ఫక్కాన్ ఓడరేవులు ప్రస్తుతం భారతీయ చమురు దిగుమతులకు ప్రధాన కేంద్రాలుగా మారాయి.
వాణిజ్య నౌకలపై దాడులు శరవేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో. హార్ముజ్ జలసంధికి తూర్పు వైపున ఉన్న యూఏఈకి చెందిన ఈ ప్రత్యామ్నాయ ఓడరేవులు భారతదేశ ఇంధన అవసరాలకు ఒక జీవనాధారంగా నిలుస్తున్నాయి. దీనితో పాట ప్రమాదకరమైన జలమార్గాన్ని దాటకుండా ఉండేందుకు భారతీయ రిఫైనరీలు యూఏఈకి చెందిన 406 కిలోమీటర్ల పొడవైన హబ్షాన్-ఫుజైరా వ్యూహాత్మక చమురు పైప్‌లైన్‌ను కూడా ఒక సమర్థవంతమైన ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగిస్తున్నట్లు ఈ రంగానికి చెందిన నిపుణులు వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన.. అయితే ఈ సరికొత్త ప్రత్యామ్నాయ మార్గాలు భారతదేశానికి కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తున్నప్పటికీ యుద్ధ మేఘాలు కొత్త ఆందోళనలను రేకెత్తిస్తూనే ఉన్నాయి. ఈ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను రేవులను కూడా తాము లక్ష్యంగా చేసుకుంటామని బుధవారం టెహ్రాన్ (ఇరాన్) హెచ్చరించినట్లు వచ్చిన తాజా నివేదికలు భారతీయ ఇంధన మార్కెట్లో దిగుమతిదారులలో సరికొత్త ఆందోళనలకు కారణమవుతున్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన అత్యంత వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో గల్ఫ్ ప్రాంతం నుండి సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

More Stories
నీట్-యూజీ 2026 లీక్..రూ.5 లక్షలకే 111 ప్రశ్నలు విక్రయం
రేపే పట్టాలెక్కనున్న తొట్టతొలి హైడ్రోజన్ రైలు
విండ్‌ఫాల్ పన్ను డీజిల్ పై రూ 7 పెంపు, పెట్రోల్ పై రూ 7 తగ్గింపు