మరోసారి నేపాల్ వీధుల్లోకి జెన్-జీ

మరోసారి నేపాల్ వీధుల్లోకి జెన్-జీ
గత వారం కాఠ్మండు పోలీసులు తన మోటార్‌సైకిల్ చక్రానికి తాళం వేయడంతో, 25 ఏళ్ల రైడ్-షేరింగ్ డ్రైవర్ తనకు తాను నిప్పంటించుకుని మరణించడం, ప్రధానమంత్రి బాలేంద్ర (బాలెన్) షా నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజాగ్రహాన్ని మరోసారి రగిలించింది. ఏడాది కూడా గడవక ముందే అఖండ మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వంపై జవాబుదారీతనం కోరుతూ, ఈ ఘటనపై అధికారులను ప్రశ్నిస్తూ నేపాల్ యువత, ముఖ్యంగా దేశంలోని జెన్ జెడ్ తరం వారు, కాఠ్మండు వీధుల్లోకి తిరిగి వచ్చారు. 
 
గురువారం కాఠ్మండు వీధిలో గణేష్ నేపాలీ ఒక క్లయింట్ కోసం ఎదురుచూస్తుండగా, పోలీసులు అతని వద్దకు వచ్చి అకస్మాత్తుగా అతని మోటార్‌సైకిల్ చక్రానికి తాళం వేశారు. నిరసన తెలిపే తీవ్ర ప్రయత్నంలో, నేపాలీ తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం కాలిన గాయాలతో మరణించాడు.
 
కానీ ఈ విషాదం, ప్రభుత్వం, పరిపాలనపై దీర్ఘకాలంగా ఉన్న అసంతృప్తిని మరోసారి తీవ్రస్థాయికి తీసుకువచ్చింది.ఈ ఏడాది మార్చిలో జరిగిన నేపాల్ పార్లమెంట్ ఎన్నికలలో బాలెన్ షా విజయానికి జెన్ జీ కారణం.  ఆదివారం నాడు, రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయమైన సింగ్‌దర్బార్ సచివాలయం వెలుపల వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
 
వారిలో చాలామంది ‘పేదలపై అరాచకాలను అరికట్టాలి’, ‘మానవ హక్కులను గౌరవించాలి’ వంటి నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. అలాగే, అక్రమ అరెస్టులను నిలిపివేయాలని, బాలెన్ షా ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల నిరాశ్రయులవుతున్న వారికి ఆశ్రయం కల్పించాలని కూడా వారు అధికారులను కోరారు.

నేపాల్ మీడియా నివేదికల ప్రకారం 2022లో కాఠ్మండ్ మేయర్‌గా బాలేన్ షా ఎన్నికైనప్పటి నుంచి పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పట్టణ నిర్వహణ విషయంలో ముఖ్యంగా ఫుట్‌పాత్‌లు, అనధికార వీధి మార్కెట్ల తొలగింపు విషయంలో ఆయన కఠిన వైఖరి అనుసరిస్తున్నారు. నదీతీరంలోని మురికివాడలను తొలగించడం కూడా ఆయన చేపట్టిన మరో చర్య. 

 
అనేక సందర్భాల్లో ఈ ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్‌లు హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. దీంతో నగరంలోని అత్యంత పేదల కనీసం మానవత్వం చూపకపోవడంపై ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. స్థానిక యంత్రాంగం నిరంతరం తన రాజ్యాంగ పరిధిని దాటి ప్రవర్తిస్తోందని చట్టపరమైన నిపుణులను ఉటంకిస్తూ స్థానిక మీడియా నివేదించింది. 
నియంత్రణలను సులభతరం చేయాల్సిన సంస్థ స్థాయి నుంచి ఫెడరల్ పోలీసు విభాగమైన ‘నేపాల్ పోలీస్’ తరహాలో దూకుడుగా వ్యవహరించే శక్తిగా మారిందని నిపుణులు విమర్శిస్తున్నారు.