ఐదు రోజులుగా గాలించి ఎన్కౌంటర్లో లష్కరే ఉగ్రవాది హతం

ఐదు రోజులుగా గాలించి ఎన్కౌంటర్లో లష్కరే ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్ఈటి) ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. దక్షిణ కశ్మీర్‌లోని సైద్‌పొరా ప్రాంతంలో గత ఐదురోజులుగా దాక్కొని ఉన్న ఎల్​ఈటీ ఉగ్రవాదిని బలగాలు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టినట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు. ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న బలగాలు అతడి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని రికవరీ చేశారు.

ఐదు రోజుల క్రితం షోపియాన్‌లోని సైద్‌పొరా ప్రాంతంలోని దట్టమైన పండ్ల తోటలో ఇద్దరు ఉగ్రవాదులు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు నిఘా కెమెరాల్లో రికార్డైంది. లష్కరే కమాండర్ జాకీర్ గనాయ్, అతని అనుచరుడు లతీఫ్ భట్ సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో జులై 3న షోపియాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్​ఓజీ), ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్(ఆర్ఆర్), సీఆర్​పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్​ను ప్రారంభించాయి. 

ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి జల్లెడ పట్టాయి. రాత్రి వేళల్లో సైతం ఆపరేషన్ నిరాటంకంగా కొనసాగేలా ఆ ప్రాంతమంతా ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఉగ్రవాదులు బలగాలకు తారసపడగా కాల్పులు జరిపారుయ. వాటికి ప్రతిగా భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

అనంతరం అనంతరం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం సమీపంలో ఉగ్రవాది మృతదేహాన్ని గుర్తించారు. అతడిని జాకిర్ అహ్మద్ గనీగా గుర్తించారు. ఘటనాస్థలికి సమీపంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి గుర్తించినట్లు పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఘటన అనంతరం మొత్తం ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జాకిర్​తో పాటు ఉన్న మరో ఉగ్రవాది లతీఫ్ కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. 

అతడు బయటకు వెళ్లకుండా తోట చుట్టూ విక్టర్‌ ఫోర్స్‌ దళాలు మోహరించారు. ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో అడవులు, కొండ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.  జమ్ములోని కుల్గాంకు చెందిన వ్యక్తి జాకిర్ గనీ. గత కొన్నేళ్లుగా లష్కరే తొయిబాలో కీలకంగా పనిచేస్తున్నాడు. గతంలో భద్రతా సిబ్బందిపై దాడులు, పౌరుల హత్యల కేసులు కూడా ఉన్నాయి.

అప్పటి నుంచి అతడిపై నిఘా వర్గాలు దృష్టి ఉంది. అయితే గనీ 2023 సెప్టెంబర్ 27 నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఇక గతేడాది ఏప్రిల్​లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు సమయంలో కూడా ఈ జాకిర్ పేరు వినిపించింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా జాకిర్‌కు సంబంధించిన ఓ ఇంటిని కూడా కూల్చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.