ఈ-రిక్షాల బ్యాటరీలను రిమోట్‌గా నిలిపివేయడానికి దారితీసిన 4 ప్రమాదకరమైన మొబైల్ యాప్‌లపై కేంద్రం తక్షణమే నిషేధం విధించింది. గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ యాప్ స్టోర్ ల నుంచి ఈ యాప్‌లను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. నిషేధానికి గురైన యాప్‌లన్నీ చాలా కాలంగా అఫీషియల్ ప్లే స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి వీటిని ఈ-రిక్షాల లిథియం అయాన్ బ్యాటరీల పనితీరును (వోల్టేజ్, టెంపరేచర్, ఛార్జింగ్ సైకిల్స్) బ్లూటూత్ ద్వారా పర్యవేక్షించడానికి డిజైన్ చేశారు.
కానీ, వీటిలోని ఒక చిన్న సెక్యూరిటీ లోపం పెద్ద ముప్పుగా పరిణమించింది. ఈ యాప్‌లలో ఎటువంటి సెక్యూరిటీ పాస్వర్డులు గానీ, అథెంటికేషన్ భద్రతా ప్రమాణాలు గానీ లేవు బ్లూటూత్ పరిధిలో (10 నుంచి 15 మీటర్ల దూరం) ఉన్న ఎవరైనా ఎటువంటి అనుమతి లేకుండానే ఈ యాప్‌ల ద్వారా సమీపంలోని ఈ-రిక్షా బ్యాటరీలకు కనెక్ట్ కావచ్చు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఆకతాయిలు రద్దీగా ఉండే రోడ్లపై వెళ్తున్న రిక్షా బ్యాటరీలను స్విచ్ఛాఫ్ చేస్తుండటంతో వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయి ఘోర ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
చైనాకు చెందిన షెన్జెన్ గ్రెనెర్జీ టెక్నాలజీ అభివృద్ధి చేసిన బిఏటి-బిఎంఎస్ యాప్ ద్వారా బ్యాటరీ వినియోగాన్ని అత్యంత సులభంగా వేరొకరు కంట్రోల్ చేసే వీలుండటంతో ఇది తీవ్రమైన ప్రజా భద్రతా ముప్పుగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్లే స్టోర్లలోకి అనుమతించే ముందు కఠినమైన తనిఖీలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. దేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో సైబర్ రక్షణను బలోపేతం చేయాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

More Stories
బద్రీనాథ్‌లోనూ కానుకల చోరీపై విచారణ
ఆధునిక డ్రోన్ల నిఘాను ఎదుర్కొనేందుకు ‘ఆకాశ్ తరంగ్’
మారుతీ సుజుకి మెగా ఖర్ఖోడా ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ, తకైచి