దీనిలో భాగంగా ఉద్ధవ్ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు త్వరలో ఉప ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే వర్గంలో చేరుతారని ఆయన వెల్లడించాయిరు. ప్రస్తుతం ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. థాకరే వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలలో 14 మందితో గురువారం ఒక రహస్య ప్రదేశంలో సమావేశం జరిగినట్లు సమాచారం.
ఈ చర్చలకు హాజరుకావడం వల్లే గురువారం నాడు షిండే రాష్ట్ర శాసనసభకు హాజరుకాలేదని కూటమిలోని వర్గాలు తెలిపాయి. అసలైన శివసేనపై పట్టు సాధించేందుకు జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఈ పరిణామం ఒక భాగం. అసెంబ్లీలో ఒక పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో విలీనం కావొచ్చు.
దీని ప్రకారం 20 మందిలో 14 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలో చేరితే విలీనం పూర్తవుతుంది. వారికి ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఇదే జరిగితే ఉద్ధవ్ శివసేనకు భారీ ఎదురుదెబ్బ తప్పదు. ప్రస్తుతం ఉద్ధవ్ శివసేన శరద్‌చంద్ర పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహా వికాస్ అఘాడి (ఎంవీయే) కూటమిగా ఉన్నాయి. ఈ కూటమికి 60 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇటీవల ఎంవీయే సమావేశం జరిగింది.
అయితే, సమావేశానికి 23 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. 37 మంది మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు. దీంతో వీరంతా షిండే వర్గంలో చేరుతారనే ప్రచారం మొదలైంది. ఇటీవలే ఉద్ధవ్ వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలో చేరారు. ఇటు ఎంపీలు, అటు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడితే ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన మనుగడే ప్రశ్నార్థక మవుతుంది.

More Stories
ఆర్ఎస్ఎస్ పై అభ్యంతరకర వాఖ్యలు.. ఖర్గేకు కోర్టు నోటీసు
సీఎం మాన్ పై ఎఫ్ఐఆర్.. వెంటనే రాజీనామా చేయాలి
11న ట్రస్ట్ సమావేశం ముందుకు చంపత్ రాయ్ రాజీనామా