రాష్ట్ర శాసన మండలి ఎన్నికలలో జరిగిన క్రాస్ ఓటింగ్ కు సంబంధించి, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ శుక్రవారం కర్ణాటక పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్పను, మరికొందరు నాయకులను పిలిపించారు. ఎన్నికలలో జరిగిన క్రాస్ ఓటింగ్ పట్ల నబిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జూన్ 23న తనను కలవాలని యడియూరప్పను, ఇతర నాయకులను ఆయన కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు వేసిన క్రాస్ ఓటింగ్ పై విచారణ జరిపేందుకు కర్ణాటకలోని బీజేపీ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ సీటీ రవి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.మహేష్, హుబ్లి-ధార్వాడ్ సెంట్రల్ ఎమ్మెల్యే మహేష్ తెంగినకాయ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఎన్డీయే అభ్యర్థుల ఓటమికి కారణమైన వారిని ఈ కమిటీ గుర్తించి జూన్ 25వ తేదీలోగా నివేదిక సమర్పిస్తుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల పోరులో, గురువారం జరిగిన ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ పోలింగ్ జరిగిన ఏడు శాసన మండలి స్థానాలలో ఐదింటిని గెలుచుకోగా, ప్రతిపక్ష బీజేపీ రెండింటిని కైవసం చేసుకుంది.
ఈ ఫలితాలలో, కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా బీజేపీ, జేడీ(ఎస్) శాసనసభ్యులు క్రాస్ ఓటింగ్ వేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే, అధికార పార్టీకి రావలసిన 140 ఓట్ల కంటే 11 ఓట్లు ఎక్కువగా, అంటే 151 ఓట్లు వచ్చాయి. శాసన మండలి ఎన్నికలలో జరిగిన క్రాస్ ఓటింగ్ ‘చాలా దురదృష్టకరం’ అని కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర శుక్రవారం తెలిపారు.
ఈ విషయంపై విచారణ జరిపేందుకు పార్టీ ఒక వాస్తవ పరిశీలన కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన ధృవీకరించారు. జేడీ(ఎస్) నుంచి ఆరేడుగురు, బీజేపీ తరఫున నలుగురి నుంచి ఐదుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు తమకు సమాచారం ఉందని చెప్పారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిని జాతీయపార్టీగా బీజేపీ ఎంతమాత్రం క్షమించేది లేదని స్పష్టం చేశారు.
ఈ చర్యకు ఎవరు పాల్పడి ఉండవచ్చనే దానిపై తమకు కొంత సమాచారం ఉందని పేర్కొంటూ సీనియర్ నాయకులకు వివరాలు తెలియజేయడానికి వచ్చే వారం తాను ఢిల్లీ వెళ్తానని ఆయన చెప్పారు. ఈ పరిణామం పార్టీ అగ్ర నాయకత్వాన్ని కలవరపరిచింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఎన్నికలలో ముగ్గురు బీజేపీ, ఎనిమిది మంది జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని, ఒక బీజేపీ ఎమ్మెల్యే ఓటు చెల్లనిదిగా ప్రకటించారని తెలుస్తోంది.

More Stories
రెబల్స్‌పై టిఎంసి వేర్వేరుగా 20 అనర్హత పిటిషన్లు
రామమందిర `విరాళాల చోరీ’ దోషులను వదిలే ప్రసక్తి లేదు
నావికాదళంలో తొలిసారి ఇద్దరు మహిళలకు ‘శౌర్య చక్ర’ పురస్కారం!