హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. తాను కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు నిధులు రాకుండా ఆపానని అసంబద్దమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాష్ట్రానికి ని ధులు ఇవ్వరాదని, నేను ఏ మంత్రితో చెప్పానో బయటపెట్టాలి. ఏ ప్రాజెక్టులకు అడ్డుపడ్డానో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పా లి..” అని కిష న్‌రెడ్డి సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా మెట్రోప్రాజె క్టు విషయంలో అనేక రకాలుగా తనపై తప్పు డు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఏడేళ్లుగా కేంద్ర సహాయ మంత్రి గా, క్యాబినెట్ మంత్రిగా తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేశానని, రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలు బాగా జరగాలనే కోరుకున్నాను తప్ప ఏనాడూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి సోమవారం మీడియాతో మాట్లాడుతూ మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 2 విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తనతో చెప్పారని, ముఖ్యమంత్రిగారు కలిసినప్పడు కూడా ఇదే విషయాన్ని చెప్పారని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ అభివృద్ధి కోసమే పనిచేశా అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం ఏనాడు చేయలేదని, కేంద్రం బాధ్యతగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తుందని పేర్కొంటూ తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి కోరితే కేంద్రం తెలంగాణలో అభివృద్ధి చేయడం లేదని, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వివక్ష లేకుండా కేంద్రం సహకరిస్తోందని చెప్పారు.
రేవంత్ అనుకుంటేనో, కిషన్ రెడ్డి అనుకుంటేనో ప్రాజెక్టులు ఆగవు అని చెబుతూ మూసీ పునరుజ్జీవనం కోసం లోన్ వచ్చేలా కేంద్రం ఎన్ ఒసి ఇచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తామంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ రేవంత్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిఎం అనేకసార్లు కేంద్రమంత్రిని కలిసారని, అర్బన్ శాఖ కొన్ని మార్పులు కోరిందని ఆయన చెప్పారు.
అయితే ప్రాజెక్టులు ఆపే సంస్కృతి బిజెపికి లేదని పేర్కొంటూ కాంగ్రెస్ అలా చేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాలను నుంచి దృష్టి మరల్చేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధికోసం ఒక ఆఫీస్ పెట్టుకుని పని చేస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

More Stories
ఎసిబి సోదాల్లో సర్వే డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.200 కోట్ల ఆస్తుల
ఎంఐఎం, లవ్ జిహాద్, అఘాయిత్యాలపై ఎందుకీ చోద్యం?
ఎస్ఐఆర్ ప్రక్రియపై బురదజల్లుతున్న కాంగ్రెస్, బిఆర్ఎస్