బ్యాంకాక్ నుంచి ముంబైకి రూ.11.82 కోట్ల విలువైన హై-క్వాలిటీ ‘హైడ్రోపోనిక్ గంజాయి’ని స్మగ్లింగ్ చేస్తూ మాజీ ‘మిసెస్ కేరళ’ పోటీదారు హర్ష సన్నీ (28) ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. విమానాశ్రయానికి చేరుకున్న హర్ష సన్నీ వ్యవహారశైలి అనుమానాదాస్పదంగా కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
లగేజీ క్లియరెన్స్ వద్ద ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్, కస్టమ్స్ అధికారులు ఆమెను పక్కకు పిలిచి, ట్రావెల్ బ్యాగ్‌ను తనిఖీ చేశారు. ఆ బ్యాగులో ప్యాక్ చేసిన 12 ప్లాస్టిక్ ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిలో పచ్చటి పదార్థం ఉంది. వెంటనే అధికారులు పరీక్షలు నిర్వహించడతా అది అత్యంత ఖరీదైన, నాణ్యమైన ‘హైడ్రోపోనిక్ మారిజువానా’ (గంజాయి) అని తేలింది.
సాధారణ గంజాయితో పోలిస్తే ల్యాబ్‌లలో నియంత్రిత వాతావరణంలో పెంచే ఈ హైడ్రోపోనిక్ గంజాయికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్, ధర ఉంటుంది. హర్ష సన్నీ వద్ద దొరికిన 11 కిలోల గంజాయి విలువ అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో సుమారు రూ.11.82 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
భారతదేశంలోకి నిషేధిత మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు హర్ష సన్నీని ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. సన్నీని ముంబైలోని ఫోర్ట్ కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

More Stories
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్!
పెట్రోల్ బంక్ ల నుండి పెట్రోల్, డీజిల్ భారీ కొనుగోళ్లపై నిషేధం