భారత్ సహా 54 దేశాలపై అమెరికా 12.5శాతం అదనపు సుంకం (టారిఫ్ లు) విధించనుంది. వెట్టిచాకిరి లేదా బలవంతపు శ్రమతో (ఫోర్స్డ్ లేబర్) తయారయ్యే వస్తువుల దిగుమతిని అడ్డుకోవడంలో విఫలమయ్యాయనే కారణంతో పలు దేశాలపై అ భారత్ సహా 54 దేశాలపై 12.5 శాతం అదనపు సుంకాలు విధించాలని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యు ఎస్ టి ఆర్) ప్రతిపాదించింది.
ఒక వంక భారత్ తో వాణిజ్య ఒప్పందం ఖరారుకు అమెరికా చర్చలు జరుపుతున్న సమయంలో ఇటువంటి సుంకాలను విధించడం విస్మయం కలిగిస్తోంది. . భారతదేశంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ ‘యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ’ కార్యాలయం భారత్‌ను దోషుల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను విధించాలని ప్రతిపాదించింది.
బలవంతపు శ్రమతో కూడిన ఉత్పత్తులపై నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయని 60 దేశాలపై సెక్షన్ 301 కింద జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ టారిఫ్ లు విధించనున్నట్లు యు ఎస్ టి ఆర్ జేమిసన్ గ్రీర్ తెలిపారు. తమ ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు బలవంతపు శ్రమ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోకపోవడం ఆమోదయోగ్యం కాదని, దీంతో అమెరికా కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమానమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు.
ఈ అసమానతలను ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. అయితే భారత్ ఈ ఆరోపణలను భారత్ తిరస్కరించింది. ఈ దర్యాప్తును నిలిపివేయాలని భారత ప్రతినిధులు అమెరికాను కోరారు. ఇటువంటి అంశాలను ప్రస్తుతం జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల పరిధిలోనే పరిష్కరించుకోవాలని కోరారు. అమెరికా నివేదిక ప్రకారం భారత్, చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా,యుకె, సౌదీ అరేబియా సహా 54 దేశాలపై 12.5శాతం అదనపు సుంకాన్ని విధించనుంది.
కెనడా, ఈక్వెడార్, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్ వంటి 6 దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఇటువంటి నిషేధం ఉన్నప్పటికీ, వాటి అమలు సరిగ్గా లేనందున వాటిపై 10 శాతం అదనపు సుంకాన్ని ప్రతిపాదించింది.

More Stories
హర్మూజ్‌కు ప్రత్యామ్నాయంగా ఒమాన్ తీరం నుండి చమురు రవాణా
`పిఎం స్వానిధి’ ద్వారా 80 లక్షల వీధి వ్యాపారులకు రూ 17,800 కోట్లు
వియత్నాంకు బ్రహ్మోస్ విక్రయించేందుకు ఒప్పందం