`పిఎ స్వానిధి’ ద్వారా 80 లక్షల వీధి వ్యాపారులకు రూ 17,800 కోట్లు

`పిఎ స్వానిధి’ ద్వారా  80 లక్షల వీధి వ్యాపారులకు రూ 17,800 కోట్లు
దేశంలోని తోపుడుబండ్లు, కూరగాయలు అమ్ముకునే వారు ఇతర చిరు చిన్నా చితక వ్యాపారులకు ఆరేండ్ల క్రితం ఆరంభించిన పిఎ స్వానిధి స్కీం సత్ఫలితాలను ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అసంఖ్యాక వీధి చిరువ్యాపారులకు ఈ స్కీం వల్ల ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు.  2020 జూన్ నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా మొత్తం మీద కోటి ఇరవై లక్షలకు పైగా కొల్లాటరల్ ఫ్రీ రుణాలను మంజూరు చేశారని తెలిపారు. 
వీటి విలువ దాదాపు రూ 17, 800 కోట్ల వరకూ ఉంటుందని,  దాదాపు 80 లక్షల మంది వీధి వ్యాపారులకు ఈ స్కీం వల్ల రుణాలు దక్కాయని ప్రధాని చెప్పారు. దానితో  వారి జీవితాల్లో కొత్తు వెలుగు వచ్చిందని తెలిపారు.  ఈ స్కీం ఆరు సంవత్సరాల సంపూర్తి దశలో ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది కేవలం పథకం కాదని, నమ్మకం, ఆదరణ అంతకు మించి బడుగు వర్గాలు తమ కాళ్ల మీద తాము నిలంబడగలిగేందుకు వీలు కల్పించే ఆసరా అని కొనియాడారు. 
ఈ పథకానికి వస్తున్న ఆధరణ చూసి ఈ పథకాన్ని మరో నాలుగేళ్ల పాటు అంటే 2030 వరకు పొడగించారని వెల్లడించారు.  పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్బర్ నిధి (సిఎం స్వానిధి) ఆరంభం అయ్యి ఆరు సంవత్సరాలే అయినా తరాలకు వెలుగులిచ్చే శక్తిని ప్రసాదించిందని పేర్కొంటూ దీనిని అంతా వినియోగిచుకోవాలని పిలుపు నిచ్చారు.  ష్యూరిటీ లేని రుణాలు, వెసులుబాటు చెల్లింపులు, సబ్సిడీలతో ఈ పధకం రూపొందింది. 
 
చిరువ్యాపారులు తమ రోజువారి సంపాదనలో ఏ కొంతైనా ఈ ఖాతాలో జమ చేసుకుంటూ పోతూ ఉంటే ఎప్పటికప్పుడు వారి అప్పులు తీరడమే కాకుండా తిరిగి వెంట వెంట బారీ రుణాలు తీసుకునేందుకు , తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ పథకాన్ని కరోనా మహమ్మారి కాలంలో ఆరంభించారు. పూర్తిగా దెబ్బతిని ఉన్న చిరువ్యాపారులను ఆదుకునేందుకు దీనిని తీసుకువచ్చారు.
 
పీఎం స్వనిధి పథకం చిరు వ్యాపారులను డిజిటల్ ప్రపంచంతో విజయవంతంగా అనుసంధానించింది. దేశ వ్యాప్తంగా సుమారు 55 లక్షల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో చేర్చారు. వీరంతా కలిసి దాదాపు రూ. 8.96 లక్షల కోట్ల విలువైన 841 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలను నిర్వహించారు. డిజిటల్ క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలు, వడ్డీ సబ్సిడీల ద్వారా లబ్ధిదారులకు దాదాపు రూ. 800 కోట్లు లభించాయి.