పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ ప్రాంతం ఇకపై అమెరికా మిలటరీ బేస్లకు రక్షణ కవచంలాగా ఉండదని అంటూఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. హజ్ యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా వరుస పోస్టులు చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు చేశారు.
బహ్రెయిన్, కువైట్, ఇరాక్, యూఏఈ, ఖతార్ లాంటి దేశాలతో కలిపి ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన చిన్న, పెద్ద మిలటరీ క్యాంపులు 19 వరకు ఉన్నాయి. “కాలం మళ్లీ వెనక్కి రాదు. ఈ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లోని దేశాలు ఇకపై అమెరికా మిలటరీ క్యాంపులను కాపాడవు. యుద్ధాలు చేయడానికి, మిలిటరీ క్యాంపులు పెట్టడానికి అమెరికాకు ఈ ప్రాంతంలో ఎలాంటి సురక్షితమైన చోటు దొరకదు” అంటూ హెచ్చరించారు.
ఖమేనీ తన ఎక్స్ ఖాతాలో వరుస పోస్టులు పెడుతూ, హజ్ యాత్రకు వచ్చిన వారంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు. “పాలస్తీనా, అల్-అక్సా మసీదుకు విముక్తి కలగాలని, ముస్లింల కష్టాలు తీరాలని, ప్రపంచాన్ని శాసిస్తున్న శక్తులపై విజయం సాధించాలని అందరూ ప్రార్థన చేయండి” అని సూచించారు.
ఈ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని ఇస్లామిక్ దేశాలు, ఈ ప్రాంతంలోని దేశాలు అనేక ఉమ్మడి సామర్థ్యాలను, ప్రయోజనాలను కలిగి ఉన్నాయని పేర్కొంటూ, ఇది నూతన వ్యవస్థను, తద్వారా “ఈ ప్రాంతం, ప్రపంచ భవిష్యత్ స్వరూపాన్ని” తీర్చిదిద్దుతుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

More Stories
అమెరికాలో భారత సంతతి మహిళ దారుణ హత్య
పాక్ తో స్నేహానికి మొగ్గుచూపుతున్న బీఎన్పీ ప్రభుత్వం
ఉక్రెయిన్పై హైపర్సోనిక్ ఒరెష్నిక్ ఆయుధం ప్రయోగించిన రష్యా