
వచ్చే ఏడాది జనవరి నుంచి పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గీయ శనివారం తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
శరణార్థుల పట్ల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం సానుభూతి చూపడం లేదని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం కింద శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పొరుగు దేశాల్లో వేధింపులకు గురై భారత్‌కు వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సీఏఏ బిల్లును కేంద్రం ఆమోదించిందని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలకు – హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది.
అయితే వారు పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించుకోగలగాలి. అటువంటి వారు పౌరసత్వం పొందటానికి అర్హులు కావాలంటే కేవలం ఆరు సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పని చేసి ఉంటే చాలు.
More Stories
బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, 14న కౌంటింగ్
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి యత్నం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి