రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఉక్రెయిన్‌పై రష్యా ఆదివారం భీకర దాడులకు దిగింది. ఈసారి అత్యంత ఆధునికమైన, శక్తివంతమైన హైపర్ సోనిక్ ఆయుధాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రాత్రిపూట మిస్సైల్స్, డ్రోన్ల దాడితో రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో నగరంలో భారీ నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా, వందమందికి పైగా గాయపడ్డారు.
నాలుగేళ్ల యుద్ధంలో ఈ ఆయుధాలను ఉపయోగిండం ఇది మూడవసారి. పట్టణంలోని స్కూళ్లు, నివాస బిల్డింగులు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలపై ఈ దాడి జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా తన వద్ద ఉన్న అత్యాధునిక హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగించినట్లు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇతర మిస్సైళ్లు, డ్రోన్లతోపాటు ఒరెష్నిక్ మిస్సైల్‌ను కూడా ప్రయోగించిందని జెలెన్‌స్కీ ఆరోపించారు.
వివిధ రకాల 90 మిస్సైల్స్ ప్రయోగించిందని, అందులో 36 బాలిస్టిక్ మిస్సైల్స్ కూడా ఉన్నాయని జెలెన్‌స్కీ తెలిపారు. అలాగే, 600 డ్రోన్లు ప్రయోగించిందని పేర్కొన్నారు. అయితే, వాటిలో చాలా వరకు తాము అడ్డుకోగలిగామని వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని మిలిటరీ కమాండ్ సెంటర్లు, ఎయిర్ బేస్‌లు, రక్షణ శాఖ స్థావరాలపై దాడి చేశామని రష్యా రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు.
ఇటీవల రష్యాలోని నివాస స్థలాలపై ఉక్రెయిన్ దాడి చేయడం వల్లే తాము ప్రతిదాడులు చేశామని రష్యా తెలిపింది. హైపర్‌సోనిక్ ఒరెష్నిక్ మిస్సైల్ ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ మంత్రి కూడా అంగీకరించారు. ఇది చాలా శక్తివంతమైనది. దాదాపు 3,000 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా చేధించగలదు. ఇది శబ్దవేగంకంటే పది రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని మొదట 2002లో, ఆ తర్వాత 2025లో ప్రయోగించింది. ఇవి చాలా ప్రభావవంతమైనవి కావడంతో ఉక్రెయిన్‌కు భారీ నష్టం కలిగినట్లు తెలుస్తోంది.
కాగా, వాయు, సముద్ర, భూతల వేదికల నుండి 600 స్ట్రైక్ డ్రోన్‌లు, 90 క్షిపణులను రష్యాపై ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలు 549 డ్రోన్‌లను, 55 క్షిపణులను అడ్డుకున్నాయని లేదా వాటి ప్రభావాన్ని నిరోధించాయని, కాగా 19 క్షిపణులు లక్ష్యాలను చేరడంలో విఫలమయ్యాయని వైమానిక దళం పేర్కొంది.

More Stories
యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ సిద్ధం
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి .. 24 మంది మృతి
వైట్‌హౌస్ వద్ద కాల్పుల కలకలం.. నిందితుడు కాల్చివేత