బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన సంచలన చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’ ఎట్టకేలకు బెంగాల్లో విడుదల కానుంది. మే 15న రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోందని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్వయంగా ప్రకటించారు. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్ల మధ్య బెంగాల్లో విడుదలకు అవకాశం లేకుండా పోయిందని తెలిపారు.
థియేటర్ యజమానులపై ఒత్తిడి తెచ్చి సినిమాను అప్పుడు ఆపేలా ప్రయత్నాలు జరిగాయని అగ్నిహోత్రి ఆరోపించారు. కానీ తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చరిత్రాత్మక విజయం తర్వాత పరిస్థితి మారింది. ది కశ్మీర్ ఫైల్స్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి ఆ సినిమాలో 1946 డైరెక్ట్ యాక్షన్ డే, నోవాఖలీ అల్లర్లు వంటి చారిత్రక ఘటనలను తెరకెక్కించారు.
ఈ చిత్రం విడుదలపై గతంలో తీవ్ర విమర్శలు, వ్యతిరేకత ఎదురైనా, చారిత్రక నిజాలను ప్రజల ముందుకు తీసుకురావడమే తన లక్ష్యమని అగ్నిహోత్రి గతంలో చెప్పారు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా విడుదల తేదీని ప్రకటించిన అగ్నిహోత్రి, బెంగాల్లో సినిమా విడుదల కోసం నిరంతరం పోరాడిన మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు. 2025లో దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బెంగాల్లో మాత్రం విడుదల అవ్వలేదు.
ది కశ్మీర్ ఫైల్స్‌లో 1990లలో జమ్ముకశ్మీర్‌లో చెలరేగిన తిరుగుబాటును కళ్లకు కట్టేలా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రేక్షకులకు చూపించారు. ఆయన రూపొందించిన మరో వాస్తవ సంఘటనల చిత్రం “ది బెంగాల్ ఫైల్స్” మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1946 ఆగస్టులో కోల్‌కతాలో జరిగిన అల్లర్ల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. బెంగాల్లో ప్రజలు ఎదుర్కొన్న ఆనాటి సమస్యలను దర్శకుడు వెండితెరపై ఆవిష్కరించారు.

More Stories
వర్షపాతం 90 శాతంకు తగ్గే అవకాశం
దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్‌లైన్ నెంబర్ 112
రిజర్వ్ చేసిన తీర్పులు 3 నెలల్లోపు ఇవ్వాల్సిందే