* ముగ్గురు భారతీయులకు గాయాలు- ప్రధాని మోదీ ఆగ్రహం
మరోవైపు ఇరాన్ డ్రోన్ దాడులను యూఏఈ ఖండించింది. “ఈ దాడులు ప్రమాదకరమైన ఉద్రిక్తతను పెంచుతాయి. ఇది ఆమోదయోగ్యం కాని దురాక్రమణ చర్య. అంతర్జాతీయ చట్ట సూత్రాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘిస్తోంది. యూఏఈ భద్రత, స్థిరత్వం, ప్రాదేశిక సమగ్రతకు ప్రత్యక్ష ముప్పు. తమ భద్రత, సార్వభౌమాధికారానికి ఎలాంటి ముప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం” అని హెచ్చరించింది.
“రక్షించుకునే క్రమంలో ఇలాంటి దాడులకు ప్రతిస్పందించే పూర్తి చట్టబద్ధమైన హక్కు యూఏఈకి ఉంది. ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలి. అన్ని శత్రుత్వాల విరమణకు పూర్తిగా కట్టుబడి ఉండాలి. ఈ దాడులు, వాటి పర్యవసానాలకు ఇరాన్ పూర్తిగా బాధ్యత వహించాలి” అని యూఏఈ పేర్కొంది.
యూఏఈలో జరిగిన దాడిలో భారతీయులు గాయపడడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడుల్లో ముగ్గురు భారత పౌరులు గాయపడ్డారు. పౌరులను, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. యూఏఈకి భారత్ గట్టి మద్దతు తెలుపుతుంది. చర్చలు, దౌత్యం ద్వారా అన్ని సమస్యల శాంతియుత పరిష్కారానికి తన మద్దతును పునరుద్ఘాటిస్తుంది” అని స్పష్టం చేశారు.

More Stories
45 ఏళ్లుగా పడిపోతున్న జపాన్ బాలల జనాభా
ఓ దుండగుడు వైట్‌హౌస్ భద్రతా సిబ్బందిపై కాల్పులు
హొర్ముజ్‌లో చిక్కుకున్న నౌకల కోసం ట్రంప్ ప్రాజెక్టు ఫ్రీడమ్