రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, మోదీ ప్రభుత్వం, బిజెపి వారికి అండగా ఉంటుందని రాంచందర్ రావు భరోసా కల్పించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మద్దతు ధరతో పాటు ట్రాన్స్‌పోర్ట్, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, హమాలీ చార్జీలు, చివరికి ఐకేపీ సెంటర్ల కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ కొనుగోళ్లు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకి ఏంటి? అని ప్రశ్నించారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, నేడు రైతులకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని విమర్శించారు. కనీసం టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో ధాన్యం మొలకెత్తి బరువు తగ్గిపోతోందని, దీనివల్ల రైతుకు గిట్టుబాటు ధర దక్కకుండా పోతోందని మండిపడ్డారు. హన్మాపూర్‌లో దాదాపు 80-100కి పైగా ధాన్యం కుప్పలు రాశులుగా పోసి రైతులు వేచి చూస్తున్నప్పటికీ, కొనుగోళ్ల విషయంలో అధికారులు కేవలం మాటలతో సరిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైస్ మిల్లర్లు, దళారులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. ఆదిలాబాద్‌లో మక్క రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని, మద్దతు ధర దేవుడెరుగు కనీసం కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు చర్యలకు పాల్పడుతున్న మిల్లర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పోరాటాలు ఉధృతం చేస్తామని రాంచందర్ రావు హెచ్చరించారు.

More Stories
నైతిక సాంకేతికత కోసం దత్తాత్రేయ హోసబాలే పిలుపు
ప్రపంచ సార్వభౌముడిగా డొనాల్డ్ ట్రంప్?
మున్నెన్నడూ లేని విధంగా ప్రజాదరణ కోల్పోతున్న ట్రంప్