ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నేరచరితుల సంఖ్య పెరిగింది. దాదాపు ప్రతి ఐదుగురు అభ్యర్థుల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్ (ఎడిఆర్), తమిళనాడు ఎలక్షన్ వాచ్ (టిఎన్‌ఇడబ్ల్యు) విశ్లేషణ వెల్లడించింది. అలాగే అభ్యర్థుల్లో నాలుగో వంతు మంది కోటీశ్వరులు ఉన్నారు.
ఎడిఆర్ మొత్తం 4,023 మంది అభ్యర్థుల్లో 3992 మంది సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించింది. వీరిలో 722 మంది (18 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు. 2021లో ఈ సంఖ్య 13 శాతంగానే ఉంది. ఈ సారి అది ఐదు శాతం పెరగడం గమనార్హం. ఇక 404 మంది (పది శాతం)పై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సంఖ్య ఆరు శాతమే కాగా, అది ఇప్పుడు నాలుగు శాతం పెరగుదలను నమోదు చేయడం ఆందోళనకరమైన విషయం.
మొత్తం 981 మంది అభ్యర్థులు కోటీశ్వరులుగా ఉన్నారు. 2021తో పోలిస్తే ఏడు శాతం పెరుగుదల నమోదైంది. అధికార డీఎంకే పార్టీ నుంచి అత్యధిక సంఖ్యలో 170 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో ప్రధాన ప్రతిపక్షం ఎఐఎడిఎంకె నుంచి 160 మంది, ప్రముఖ తమిళ సినీ నటుడు విజరు స్థాపించిన కొత్త పార్టీ టివికె నుంచి 156 మంది ఉన్నారు. ఇక బిజెపి (31 మంది), కాంగ్రెస్ (27 మంది), పిఎంకె (16 మంది), డిఎండికె (10 మంది)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

More Stories
ఉధంపూర్‌లో బస్సు లోయలో పడి 21 మంది మృతి
మణిపూర్ హింసాకాండ ఘటనలో 21 మంది అరెస్ట్
తమిళనాడు బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 23 మంది మృతి