సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్‌పూలే 200వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు నివాళులర్పించారు. శనివారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో కలిసి పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణా స్థల్ వద్ద మహాత్మా జ్యోతారావ్ పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే తన జీవితాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము నివాళులు అర్పించారు. ఆయన మహిళా విద్యాభివృద్ధికి గణనీయమైన కృషి చేసి, సామాజిక సంస్కరణ, సమ్మిళితత్వానికి సంబంధించిన శాశ్వత వారసత్వాన్ని వదిలివెళ్లారని ఆమె కొనియాడారు.
ఈ నివాళి కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, జెపి నడ్డా, మాజీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌లు పాల్గొన్నారు. కాగా, ఈ సందర్భంగా ‘సమానత్వం, న్యాయం, విద్య అనే ఆదర్శాలకు తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. ఆయన మహిళలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణలో మార్గదర్శకుడు’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

More Stories
యుపి ఎస్ఐఆర్ లో 84 లక్షల మంది పెరిగిన ఓటర్లు!
‘సీసీటీవీ’లతో సైనికుల కదలికలపై నిఘా పెట్టిన ఉగ్రముఠా
నాసిక్ బహుళజాతి సంస్థలో లైంగిక వేధింపుల గుట్టు రట్టు